/rtv/media/media_files/2025/01/27/dvMEvXt7O90ZFk6SMWIN.jpg)
cold
శీతాకాలంలో చల్ల గాలి వల్ల చాలా మందికి జలుబు చేస్తుంది. ఎన్ని మందులు వాడినా కూడా ఆ జలుబు తగ్గదు. దీనికి తోడు వేడి నీరు కాకుండా చల్లని నీరు తాగడం వల్ల ఈ జలుబు కాస్త ఎక్కువ అవుతుంది. అయితే చలికాలంలో జలుబు సమస్యను తగ్గించుకోవాలంటే తప్పకుండా ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: Winter Season: ఈ సీజన్‌లో ఉదయాన్నే ముక్కు మూసుకుపోతుందా.. అయితే ఈ చిట్కాలు పాటించాల్సిందే!
జలుబు, దగ్గు వచ్చినప్పుడు ఇంట్లోనే కొన్ని రెమిడీస్ పాటించాలి. తేనె, దాల్చిన చెక్క కలిపి తీసుకుంటే ఈజీగా జలుబు తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. ఇవి ఎంతో కాలంగా సహజ వైద్యాలుగా వాడుకలో ఉన్నాయి. ఈ చిట్కా జలుబును పూర్తిగా నయం చేస్తుంది. దీనివల్ల దగ్గు, గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ వంటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. తేనెలోని తీపి, మృదువైన స్వభావం గొంతు సమస్యలను తగ్గిస్తుంది. ముఖ్యంగా రాత్రిపూట వచ్చే దగ్గును తగ్గిస్తుంది. తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు, సూక్ష్మజీవులతో పోరాడే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది గొంతులోని చిన్న ఇన్‌ఫెక్షన్లు, చిరాకును తగ్గిస్తుంది. కొన్ని పరిశోధనల్లో తేనె దగ్గు మందుల కంటే మెరుగ్గా పనిచేస్తుందని తేలింది. అలాగే దాల్చిన చెక్కలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. దాల్చిన చెక్కలోని సహజ నూనెలు శ్వాసనాళాల్లోని కఫాన్ని కరిగించి శ్వాస తీసుకోవడం ఈజీగా చేస్తుంది.
మితంగా మాత్రమే తీసుకోవాలని..
ఈ రెండింటితో టీస్పూన్ దాల్చిన చెక్క పొడిలో నాలుగు టీ స్పూన్ల తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు మూడు సార్లు తీసుకోవచ్చు. వేడి నీటిలో కలిపి తీసుకుంటే గొంతులోని కఫం పూర్తిగా తగ్గుతుంది. ముఖ్యంగా పడుకునే ముందు వేడి నీటిలో కలిపి తాగితే రాత్రి దగ్గు తగ్గి, బాగా నిద్ర పడుతుంది. అయితే దీన్ని లిమిట్‌గా మాత్రమే తీసుకోవాలి. అంతే కానీ అధికంగా తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల కాలేయ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. కాబట్టి కాస్త లిమిట్‌లోనే వీటిని తీసుకోవడం మంచిదని తెలిపారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చూడండి: Instant Noodles: ఇన్‌స్టంట్ నూడుల్స్ తో ఇన్‌స్టంట్ హార్ట్ ఎటాక్.. ఈ నిజాలు తెలిస్తే షాకే..!
Follow Us