/rtv/media/media_files/2025/01/05/winter-safety.jpeg)
Winter season
శీతాకాలం ప్రారంభమైంది. చలి కాస్త ఉండటంతో ఎక్కువ శాతం నీరు తాగడానికి పెద్దగా ఇష్టపడరు. సాధారణంగా తీసుకునే నీరు కంటే ఇంకా తక్కువగా తీసుకుంటారు. ఏ సీజన్‌లో అయినా వాటర్ తక్కువగా తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే వాటర్ తాగడం చలి కాలంలో తగ్గిస్తే హైడ్రేషన్‌కు గురవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చర్మమంతా పగుళ్లు ఏర్పడుతుంది. అలాగే ఒక్కసారిగా రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దీంతో జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు కూడా వస్తాయి. ఎందుకంటే సాధారణంగానే చలికాలంలో జలుబు, దగ్గు, జ్వరం వంటివి వస్తుంటాయి. దీనికి తోడు వాటర్ తాగకపోతే బాడీ డీహైడ్రేషన్‌కు గురై ఇమ్యూనిటీపవర్ ఒక్కసారిగా పడిపోయి అనారోగ్య సమస్యల బారిన పడతారు. మిగతా సీజన్లతో పోలిస్తే ఈ చలికాలంలోనే చాలా మందికి అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. చలికాలంలో దాహం వేయకపోయినా కూడా తరచుగా వాటర్ తాగాలని నిపుణులు చెబుతున్నారు. అయితే చలికాలంలో తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల కూడా బాడీ డీహైడ్రేషన్‌కు గురవుతుందని నిపుణులు అంటున్నారు. అవేంటో మరి చూద్దాం.
ఇది కూడా చూడండి: Health Tips: మోషన్ ఇర్రెగ్యులర్‌గా ఉందా..? నిపుణుల సలహాలు.. పరిష్కార మార్గాలు తెలుసుకోండి!!
ఇండోర్ హీట్
చలికాలంలో చాలా మంది వేడి కోసం ఇంట్లో సెంట్రల్ హీటింగ్ పెడుతుంటారు. ఇందులో ఎక్కువ గంటల పాటు ఉండటం వల్ల చర్మం పొడి బారుతుంది. అలాగే బాడీ కూడా డీహైడ్రేషన్ కు గురవుతుంది. దీంతో పాటు ముక్కు నుంచి రక్తం కారుతుందని నిపుణులు అంటున్నారు.
వాటర్ కంటే కాఫీ తీసుకోవడం
శీతాకాలంలో వాటర్ కాకుండా కాఫీ, టీ వంటివి ఎక్కువగా తీసుకుంటారు. ఇవి బాడీని డీహైడ్రేట్ ఎక్కువగా చేస్తాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఈ శీతాకాలంలో ఎక్కువగా కెఫిన్ ఉండే పదార్థాలను తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ జాగ్రత్తలు
శీతాకాలంలో తగు జాగ్రత్తలు అనేవి తప్పనిసరిగా తీసుకోవాలి. మీ చర్మం పొడిగా మారి, పెదవులు పగుళ్లు వస్తే మాత్రం తప్పకుండా మీరు వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. బాడీకి హీట్‌ను పెంచేవి కాకుండా సాధారణమైనవి తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: Memory Loss: అల్జీమర్స్ ముప్పు మహిళలకే ఎక్కువ.. మెదడు వృద్ధాప్యంపై అధ్యయనంలో ఆశ్చర్యకర విషయాలు వెల్లడి!!
Follow Us