Health Tips: చలికాలంలో ఎముకలు దృఢంగా ఉండాలంటే.. ఇవి తినాల్సిందే! చలికాలంలో ఎముకలు బలహీనం కాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే రాగి జావ, డ్రైఫ్రూట్స్, పైనాపిల్‌ను డైట్‌లో చేర్చుకోవాలి. వీటిని డైలీ తినడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. By Kusuma 23 Nov 2024 in లైఫ్ స్టైల్ Short News New Update షేర్ చేయండి చలి తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతుంది. దీనివల్ల కొందరికి అలసట, బలహీనం వంటివి వస్తాయి. దీనికి కారణం రోగనిరోధక శక్తి తగ్గడం, పోషకాహార లోపం వల్ల కీళ్ల నొప్పులు, ఎముకలు బలహీనంగా అనిపిస్తాయి. అయితే చలి కాలంలో ఎముకలు బలంగా ఉండాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను డైట్‌లో చేర్చుకోవాలి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల చలి కాలంలో ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు. చలిని తట్టుకుని ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ కాలంలో తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏంటో చూద్దాం. ఇది కూడా చూడండి: TMC: బెంగాల్ ఉప ఎన్నికల్లో టీఎంసీ హవా.. బీజేపీ కంచుకోట బద్ధలు! రాగి జావ పురాతన రోజుల నుంచి రాగి జావకి చాలా ప్రాముఖ్యత ఉంది. దీన్ని డైలీ చలికాలంలో తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా ఎముకల ఆరోగ్యానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో కీళ్ల నొప్పుల సమస్యను తగ్గిస్తాయి. కేవలం రాగి జావ అనే కాకుండా రోటీలు చేసుకుని కూడా తాగవచ్చు. ఇది కూడా చూడండి: మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరు.. తెరపైకి కొత్త పేరు? డ్రైఫ్రూట్స్ఆరోగ్యానికి మేలు చేసే డ్రైఫ్రూట్స్‌ను తప్పకుండా ఈ సీజన్‌లో తీసుకోవాలి. ఇవి ఎముకలను బలపర్చడంలో బాగా సహాయపడతాయి. ఇందులో ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే ఆర్థరైటిస్, బోలు ఎముకల వ్యాధిని కూడా తగ్గిస్తాయి. ఇది కూడా చూడండి: హాయ్ .. హలో అంటూ ఫోన్ కాల్.. కట్ చేస్తే న్యూడ్ వీడియో! పైనాపిల్పైనాపిల్లో ఉండే పోషకాలు ఎముకలను బలంగా చేయడంలో బాగా సహాయపడతాయి. ఇందులో విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులను తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం ఇది కూడా చూడండి: మహారాష్ట్రలో 'నితీష్ కుమార్' మోడల్.. సీఎం అభ్యర్థిపై బీజేపీ వ్యూహం ఇదేనా? #calcium #health-tips #calcium-deficiency #winter-season మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి