Health Tips: చలికాలంలో ఎముకలు దృఢంగా ఉండాలంటే.. ఇవి తినాల్సిందే!
చలికాలంలో ఎముకలు బలహీనం కాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే రాగి జావ, డ్రైఫ్రూట్స్, పైనాపిల్‌ను డైట్లో చేర్చుకోవాలి. వీటిని డైలీ తినడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
చలికాలంలో ఎముకలు బలహీనం కాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే రాగి జావ, డ్రైఫ్రూట్స్, పైనాపిల్‌ను డైట్లో చేర్చుకోవాలి. వీటిని డైలీ తినడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఎముకల సాంద్రతను పెంచడానికి, విటమిన్ డి తీసుకోవడం చాలా ముఖ్యం. కానీ ఎముకలకు విటమిన్ డి తీసుకోవడం మాత్రమే సరిపోదు. మీరు దానితో పాటు కాల్షియం కూడా ఉపయోగించడం ముఖ్యం. ఇది ఎముకలకు చాలా ముఖ్యమైన కలయిక.
ఎముకలు ఆరోగ్యంగా, బలంగా ఉండాలంటే కాల్షియం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు. పాల వల్ల కాల్షియం బాగా పెరుగుతుంది. పాలంటే ఇష్టపడని వారి క్యారెట్, కాయధాన్యాలు, నువ్వులు, సోయాబీన్స్ తింటే కాల్షియం బాగా లభిస్తుంది. కాల్షియం పెరగాలంటే కాలే, బ్రోకలీ, ఆకు కూరలను తినాలి.
కొత్తిమీరతో కొన్ని సమస్యలన్నింటికి చెక్ పెట్టవచ్చు. ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కొత్తిమీరలో ప్రోటీన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఎ, బి, సి వంటి పోషకాలు ఎక్కువ. ఇవి శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి.