TMC: బెంగాల్ ఉప ఎన్నికల్లో టీఎంసీ హవా.. బీజేపీ కంచుకోట బద్ధలు!

బెంగాల్ ఉప ఎన్నికల్లో టీఎంసీ సత్తా చాటుతోంది. ఆరు స్థానాల్లోనూ క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్తోంది. నైహతి, హరోవా, మెదినీపూర్, తల్దాంగ్రా, సీతాయ్ (ఎస్‌సీ), మదారిహత్ (ఎస్‌టీ)లో ముందంజలో ఉంది.  

author-image
By srinivas
New Update
Mamata Banerjee: కేంద్రంలో చట్ట విరుద్ధంగా ప్రభుత్వం కొలువుదీరుతోంది..మమతా బెనర్జీ

TMC: బెంగాల్ ఉప ఎన్నికల్లో టీఎంసీ సత్తా చాటుతోంది. ఈ ఉప ఎన్నికల్లో క్లీన్ స్వీప్ దిశగా సాగుతోంది. ఆరు స్థానాల్లోనూ టీఎంసీ ఆధిక్యంలో కొనసాగుతోంది. నైహతి, హరోవా, మెదినీపూర్, తల్దాంగ్రా, సీతాయ్ (ఎస్‌సీ), మదారిహత్ (ఎస్‌టీ)లో ముందంజలో ఉంది. 

బీజేపీ కంచుకోట బద్దలు..

నార్త్ 24 పరగణాస్‌లోని నైహతి నియోజకవర్గం, బంకురాలోని తల్దంగ్రా నియోజకవర్గాల్లో టీఎంసీ ముందంజలో ఉంది. వీటిలో ఐదు స్థానాలు దక్షిణ బెంగాల్‌లో ఉండగా, మదారిహట్  బీజీపీకి  కంచు కోటగా పేరుగాంచింది. అయినప్పటికీ మదారిహట్ లోనూ టీఎంసీ ముందజలో కొనసాగుతోంది. నవంబర్ 13న జరిగిన ఉప ఎన్నికలో దాదాపు 69.29 శాతం ఓటింగ్ జరిగింది. ఇక 2021లో మదారిహట్ సీటును బీజేపీ గెలుచుకుంది. 

ఇది కూడా చదవండి: Priyanka Gandhi: అన్న మెజార్టీని దాటిన ప్రియాంక.. వయనాడ్‌లో సంచలనం!

ఇదిలా ఉంటే... కర్ణాటకలో మూడు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. గుజరాత్‌ వావ్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఆధిక్యంలో నిలిచారు. అసోంలో బీజేపీ 2, కాంగ్రెస్‌ 1, ఏజీపీ 1, యూపీపీ ఒక స్థానంలో ఆధిక్యం ఉన్నాయి. పంజాబ్‌ ఉప ఎన్నికల్లో 3 చోట్ల ఆప్‌, ఒక స్థానంలో కాంగ్రెస్‌ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ ఉప ఎన్నికలో బీజేపీ ముందంజలో ఉంది. యూపీ ఉప ఎన్నికల్లో బీజేపీ 6, ఎస్పీ 3, ఆర్‌ఎల్డీ ఒక స్థానంలో ఆధిక్యం ఉన్నాయి. రాజస్థాన్‌లో బీజేపీ 3, కాంగ్రెస్‌ 2, భారత్‌ ఆదివాసీ 2 స్థానాల్లో లీడ్ లో ఉన్నాయి. మధ్యప్రదేశ్‌ ఉప ఎన్నికల్లో రెండు స్థానాల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. 

ఇది కూడా చదవండి: Maha Vikas Aghadi: మహా వికాస్ అఘాడి చేసిన ఈ తప్పులే ఓటమికి కారణం..

Advertisment
Advertisment
తాజా కథనాలు