చలికాలంలో ఈ ఫుడ్ తింటే.. సమస్యలన్నీ పరార్

చలికాలంలో తెల్ల నువ్వులను డైలీ తినడం వల్ల దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి పొందవచ్చని నిపుణులు అంటున్నారు. ఇందులోని పోషకాలు శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.

New Update
Sesame seeds

చలికాలంలో చాలా మంది ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తింటుంటారు. వేడిగా ఉండే బజ్జీ, చాట్ వంటి ఫాస్ట్ ఫుడ్‌ను తినడానికి ఇష్టపడతారు. ప్రాసెస్డ్ చేసిన ఫుడ్ తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండటంతో పాటు బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే తప్పకుండా తెల్ల నువ్వులను తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చూడండి: యువతకి కిక్కు ఇస్తున్న.. మ్యాడ్ స్క్వేర్ స్వాతి రెడ్డి సాంగ్

శీతాకాలపు సూపర్ ఫుడ్..

తెల్ల నువ్వులు చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడమే కాకుండా చెడు కొలెస్ట్రాల్‌ను తగించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. ఈ నువ్వుల గింజలలో చాలా పోషకాలు ఉన్నాయి. వీటిని శీతాకాలపు సూపర్ ఫుడ్ అని అంటారు. నువ్వులలో ప్రోటీన్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, కాల్షియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. నువ్వులు తీసుకోవడం వల్ల చర్మం, జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. 

ఇది కూడా చూడండి: Weather: రుతుపవనాల సీజన్‌ లో అల్పపీడనాలు..ఎందుకింత తీవ్రం!

తెల్ల నువ్వులను డైలీ తీసుకోవడం గుండె సమస్యలు రావు. ఇందులోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే బీపీని కూడా అదుపులో ఉంచుతాయని నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో తెల్ల నువ్వులతో చేసిన వాటిని తినడం ద్వారా కాల్షియం లోపం తగ్గుతుంది. నువ్వుల్లో ఎక్కువగా మెగ్నీషియం, జింక్ వంటివి ఉన్నాయి. ఇవి కీళ్ల నొప్పులను తగ్గించడంతో పాటు ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇందులోని ఫైబర్ జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. అలాగే ఎసిడిటీ, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. కడుపు సంబంధిత సమస్యలు అన్ని కూడా క్లియర్ అవుతాయి. 

ఇది కూడా చూడండి:  ISRO: మరో కొత్త ప్రయోగంతో ఇస్రో రెడీ..రేపు PSLV-C60 కౌంట్డౌన్

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చూడండి:  AP: పవన్ కల్యాణ్ పర్యటనలో నకిలీ సెక్యూరిటీ సూర్యప్రకాష్ కథ ఇదే..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు