/rtv/media/media_files/2025/07/27/lakshmi-devi-2025-07-27-16-43-54.jpg)
Lakshmi devi
కొందరు కొన్ని తప్పులు చేయడం వల్ల ఇంట్లో దరిద్రం తిష్ట వేసుకుని ఉంటుంది. ఏ పని చేపట్టినా సరిగ్గా జరగదు. అయితే ఇంట్లో ఉన్న దరిద్రం వెళ్లిపోవాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో ఈ స్టోరీలో చూద్దాం.
ఇంటి శుభ్రం
ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా, పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి, ముగ్గు వేసి, పూజ చేయడం మంచిది. లక్ష్మీదేవి పరిశుభ్రత ఉన్న చోట నివసిస్తుందని నమ్ముతారు.
ఇది కూడా చూడండి:Nose Infection: వర్షాకాలంలో ముక్కు అనారోగ్యానికి గురవుతుందా..? సకాలంలో జాగ్రత్త తీసుకోకపోతే..!!
ధూపం
గుగ్గిలం పొడి, సాంబ్రాణి, ఎండు కొబ్బరి పొడి, పంచదార, ఆవు నెయ్యి కలిపి మండించి ఇంట్లో ధూపం వేయాలి. మంచి సువాసన రావడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తిని తొలగిస్తుందని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల దరిద్ర దేవతను ఇంటి నుంచి పారద్రోలుతుందని పండితులు అంటున్నారు.
వస్త్రధారణ
ఎప్పుడూ శుభ్రమైన, ఉతికిన దుస్తులు ధరించాలి. చిరిగిన లేదా మాసిపోయిన వస్త్రాలు దరిద్రానికి కారణమవుతాయని చెబుతారు.
ఇది కూడా చూడండి: Roshni Walia :సెక్స్ చెయ్.. ఎంజాయ్ చెయ్.. కానీ కండోమ్ యూజ్ చెయ్.. హీరోయిన్ సంచలనం
చెప్పులు
తెగిన చెప్పులను లేదా ఇతరులు వాడిన చెప్పులను ఉపయోగించకూడదు. ఇంట్లో తెగిన చెప్పులు ఉంటే వెంటనే బయట పడేయాలి.
భోజనం చేసే విధానం
భోజనం చేసేటప్పుడు ప్లేట్ కదలకుండా చూసుకోవాలి. తిన్న తర్వాత వేళ్లను నాకడం, తిన్న పళ్లెంలో చేతులు కడగడం వంటివి దరిద్రానికి దారితీస్తాయని నమ్ముతారు.
ఇది కూడా చూడండి:Mansa Devi Temple: ఆరుగురి ప్రాణాలు తీసిన పుకార్లు.. తొక్కిసలాటకు కారణం ఇదే!
వస్తువులు
ఫెంగ్ షుయ్ ప్రకారం జేడ్ ప్లాంట్, తాబేలు, చేపల తొట్టి, ఎరుపు దారంతో కట్టిన మూడు నాణేలు, ఫెంగ్ షుయ్ కప్ప వంటివి ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధనం వస్తుందని పండితులు అంటున్నారు.
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.