/rtv/media/media_files/2025/06/27/ashada-vinayaka-chaturthi-2025-2025-06-27-15-55-33.jpg)
Vinayaka Chaturthi 2025
హిందువుల పండుగల్లో ఎంతో ప్రాముఖ్యత ఉన్న వినాయక చవితిని ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. రకరకాల పండ్లు, వివిధ రకాల పిండి వంటలు గణపతికి నైవేద్యంగా సమర్పిస్తారు. గణపతిని విఘ్నాలకు అధిపతిగా, శుభకార్యాలకు మూలకర్తగా భావిస్తారు. ఈ క్రమంలోనే ఏ శుభకార్యం చేపట్టినా కూడా ముందుగా వినాయకుడిని పూజిస్తారు. అయితే వినాయక చవితికి ముఖ్యంగా ఉండ్రాళ్లు, మోదకాలు వంటి పదార్థాలను నైవేద్యంగా పెడతారు. వీటిని తీసుకోవడం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో మరి మీకు కూడా తెలియాలంటే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.
ఇది కూడా చూడండి:Vinayaka chavithi 2025: వినాయక చవితి నాడు ఎవరు ఏ రంగు దుస్తులు ధరిస్తే మంచిదో మీకు తెలుసా?
ఉండ్రాళ్లు
వినాయక చవితి ప్రసాదాల్లో ఉండ్రాళ్లు చాలా ముఖ్యమైనవి. వీటిని బియ్యప్పిండితో తయారుచేస్తారు. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. బియ్యం పిండి ఈజీగా జీర్ణం అవుతుంది. ఇందులో కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. వీటిని ఆవిరిపై ఉడికించి చేస్తారు. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయని నిపుణులు అంటున్నారు.
మోదకాలు
వినాయకుడికి ఇష్టమైన వాటిలో మోదకాలు చాలా ముఖ్యమైనవి. వీటిని బియ్యం పిండితో తయారు చేస్తారు. లోపల బెల్లం, కొబ్బరి వంటి మిశ్రమాలని పెట్టి ఆవిరిపై ఉడికించి చేస్తారు. మరికొందరు వీటిని స్వీట్స్ లాగా చేస్తుంటారు. అయితే ఈ మోదకాలలో ఉపయోగించే బెల్లం, కొబ్బరి వంటి ప్రధాన పదార్థాల వల్ల శరీర ఆరోగ్యానికి ప్రయోజనం కలుగుతంది. బెల్లం రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది. కొబ్బరిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి. ఆవిరిపై వండటం వల్ల ఆరోగ్యకానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు.
శనగలు
వినాయకుడికి ఇష్టమైన ప్రసాదాలలో శనగలు కూడా ఒకటి. ఉడికించిన శనగలను నైవేద్యంగా పెడతారు. అయితే శనగల్లో ప్రోటీన్, ఫైబర్, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి కండరాల నిర్మాణానికి సహాయపడతాయి. అలాగే ఇందులోని ఫైబర్ జీర్ణ క్రియ వంటి సమస్యలు రావని నిపుణులు అంటున్నారు.
పాయసం
బెల్లం, పాలు, సేమియా లేదా బియ్యంతో పాయసం తయారు చేస్తారు. పాలలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని నిపుణులు అంటున్నారు. కొందరు ఈ పాయసంలో పంచదార ఉపయోగిస్తారు. అయితే పంచదార కాకుండా బెల్లం ఉపయోగిస్తే ఆరోగ్యంతో పాటు రుచిగా కూడా ఉంటుందని నిపుణులు అంటున్నారు.
లడ్డూలు
శనగపిండి, బెల్లం లేదా చక్కెరు, నెయ్యితో లడ్డూలు తయారు చేస్తారు. శనగపిండిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. వీటిలో పంచదారకు బదులు బెల్లం వాడటం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.
అప్పాలు
బియ్యప్పిండి, బెల్లంతో తయారుచేసి నూనెలో వేయించిన అప్పాలను నైవేద్యంగా పెడతారు. వీటిలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. అయితే, వీటిని నూనెలో వేయించడం వల్ల కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మితంగా తీసుకోవడం అవసరం.
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చూడండి:Vinayaka Chavithi 2025: 500 ఏళ్ల తర్వాత ప్రత్యేకమైన వినాయక చవితి.. ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్ట యోగం!