/rtv/media/media_files/2025/02/12/hcYKezpWCLtE0jz51DTK.jpg)
hug day special
Valentines Day 2025: వాలెంటైన్ వీక్ లో ప్రతీ రోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ ప్రేమ పండగలో ఆరవ రోజు అంటే ఈరోజు హగ్ డే. ఈరోజున ప్రేమికులు, కపుల్స్ తమ ప్రియురాలు, ప్రియుడిని ప్రేమగా హగ్ చేసుకుంటారు. హగ్ తో బంధాన్ని బలపరచడంతో పాటు మాధుర్యాన్ని నింపుతారు. అయితే ప్రియమైన వారిని కౌగిలించుకోవడం వల్ల భావోద్వేగపరమైన సంతోషం మాత్రమే కాకుండా ఆరోగ్య సంబంధిత ప్రయోజనాలు కూడా లభిస్తాయి. కౌగిలించుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read: Big Breaking: రామమందిర ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్ కన్నుమూత!
మానసిక స్థితి
పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. కౌగిలించుకోవడం వల్ల అనేక రకాల మానసిక ప్రయోజనాలు లభిస్తాయి. హగ్ మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుందని పరిశోధనలో తేలింది. హగ్ చేసుకున్నప్పుడు శరీరం ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ని విడుదల చేస్తుంది. దీనిని లవ్ హార్మోన్ అని కూడా అంటారు. ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది.
రోగనిరోధక వ్యవస్థ
హగ్ రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. కౌగిలించుకోవడం వల్ల శరీరంలో వైట్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తి పెరుగుతుంది. తెల్ల రక్తకణాలు వ్యాధుల నుంచి రక్షణను అందిస్తాయి.
ఇది కూడా చదవండి: రాత్రంతా గిన్నెలను సింక్‌లోనే ఉంచుతున్నారా.. ఈ పొరపాటు చేయొద్దు
రక్తపోటు
హగ్ చేసుకోవడం ద్వారా శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. తద్వారా శరీరమంతా ఆక్సిజన్ సరఫరా బాగా జరుగుతుంది. దీని వల్ల రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.
నిరాశ ,ఒంటరితనం
ప్రియమైన వారిని హగ్ చేసుకోవడం నిరాశ, ఒంటరితనాన్ని తగ్గిస్తాయి. హగ్ చేసుకున్నప్పుడు ఆక్సిటోసిన్, సెరోటోనిన్ హార్మోన్ల స్థాయిలు పెరుగుతాయి. ఇవి ఒంటరితనం, కోపం వంటి భావోద్వేగాల నుంచు ఉపశమనం పొందడంలో సహాయపడతాయి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.
Also Read: సింగపూర్‌కు ఉగ్రదాడుల ముప్పు.. ప్రజలంతా రెడీగా ఉండాలంటూ మంత్రి వ్యాఖ్యలు!