Sugar And Salt: వర్షాకాలంలో ఉప్పు, చక్కెర తేమగా ఉందా..? ఈ చిట్కాలను ట్రై చేయండి

వర్షాకాలంలో ఉప్పు లేదా చక్కెర పదార్థాలలో తేమను తొలగించడానికి.. వాటి కంటైనర్లలో 2,3 ముక్కల దాల్చిన చెక్కను ఉంచడం ఉత్తమం. దాల్చిన చెక్క తేమను గ్రహించే లక్షణంతోపాటు స్వచ్చమైన సువాసనను కూడా ఇస్తుంది. చక్కెర, ఉప్పు పెట్టెలో 3,4 లవంగాలను వేస్తే తేమ తగ్గుతుంది.

New Update
sugar and salt

Sugar And Salt

Sugar And Salt: వర్షాకాలం పునరుజ్జీవనానికి, చల్లదనానికి, ప్రకృతి అందాలకు ప్రాతినిధ్యం వహించినా.. వంటగదిలో మాత్రం కొన్ని చిన్నా పెద్ద సమస్యలను తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా గాలిలో తేమ ఎక్కువగా ఉండటంతో ఉప్పు మరియు చక్కెర వంటి దినసరి పదార్థాలు తడిగా మారి ఒకదానికొకటి అంటుకునే స్థితికి చేరుతాయి. ఇవి వాడటానికి అసౌకర్యంగా మారడమే కాకుండా.. వాటి రుచి, స్వచ్ఛత కూడా నష్టపోతుంది. ఇక కొన్నిసార్లు ఈ తడిపడిన పదార్థాల్లో ఫంగస్ లేదా చీమలు పెరగడం వల్ల ఆరోగ్యానికి కూడా హానికరంగా మారుతుంది. అయితే కొన్ని సులభమైన ఇంటి చిట్కాలు వాడటం ద్వారా ఈ సమస్యకు సులభంగా పరిష్కారం కనిపెట్టవచ్చు. ఆ చిట్కాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

వర్షాకాలంలో ఇంటి చిట్కాలు..

ఉప్పు లేదా చక్కెర పదార్థాలలో తేమను తొలగించడానికి.. వాటి కంటైనర్లలో 2,3 ముక్కల దాల్చిన చెక్కను ఉంచడం ఉత్తమం. దాల్చిన చెక్క తేమను గ్రహించే లక్షణంతోపాటు స్వచ్చమైన సువాసనను కూడా ఇస్తుంది. ఇదే విధంగా లవంగాలను కూడా పయోగించవచ్చు. చక్కెర, ఉప్పు పెట్టెలో 3,4 లవంగాలను వేయడం వల్ల తేమ తగ్గుతుందని మాత్రమే కాకుండా చీమలు కూడా దూరంగా ఉంటాయి. వేరే ప్రత్యామ్నాయం కావాలంటే ఒక చిన్న కాటన్ గుడ్డలో కొంత పొడి బియ్యాన్ని కట్టి ఆ కంటైనర్లలో ఉంచండి. బియ్యం తేమను ఆకర్షించడంతో చక్కెర, ఉప్పు పొడిగా ఉంటాయి.

ఇది కూడా చదవండి: యోగా ద్వారా డయాబెటిస్ నివారణ.. కొత్త నివేదికలో చెబుతున్న నిజాలు ఇవే

తేమ నివారణలో నిల్వ చేసే కంటైనర్ రకం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. గాజు గాలి చొరబడని జాడిలు వాడటం ఉత్తమం. ప్లాస్టిక్ లేదా స్టీల్ కంటైనర్లతో పోల్చితే గాజు తేమను తక్కువగా గ్రహిస్తుంది. అలాగే వీటికి గట్టి మూతలు ఉండటం వల్ల గాలి, తేమ ప్రవేశించకుండా నిరోధించవచ్చు. చక్కెర లేదా ఉప్పు తీసుకోవాలనుకున్నప్పుడు.. ఎప్పుడూ పొడి చెంచాను మాత్రమే ఉపయోగించాలి. తడి చెంచా వల్ల తేమ నేరుగా కంటైనర్‌లోకి వెళుతుంది. ఇది పదార్థాన్ని త్వరగా తడిగా మార్చేస్తుంది. ఈ చిన్నచిన్న జాగ్రత్తలతో వర్షాకాలంలో ఉప్పు, చక్కెర వంటి నిత్యవసరాలు తేమ, ఫంగస్, చీమల బెడద నుంచి రక్షించబడతాయి. వంటగదిలో శుభ్రతను పాటించడమే కాకుండా.. ఆరోగ్యాన్ని కాపాడుకునే మార్గం కూడా ఇది. కాబట్టి ఈ చిట్కాలను పాటించి వర్షాకాలంలో సమస్యలు లేకుండా చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.  

ఇది కూడా చదవండి: శివారాధనతో వివాహ సమస్యలకు పరిష్కారం.. విశ్వాసాల్లోని ఆధ్యాత్మిక వాస్తవాలు

home-tips | home tips in telugu | Latest News | telugu-news | sugar | salt )

Advertisment
తాజా కథనాలు