/rtv/media/media_files/2025/10/28/nightmare-disorder-2025-10-28-14-10-01.jpg)
Nightmare Disorder
రాత్రి నిద్రలో భయంకరమైన కలలు రావడం, ఉలిక్కిపడి లేవడం తరచుగా జరుగుతుంటే.. అది దైనందిన జీవితంపై ప్రభావం చూపుతుంటే.. దీనిని దుస్వప్న రుగ్మత (Nightmare Disorder)గా చెప్పవచ్చు. అడపాదడపా పీడకలలు రావడం సాధారణమే అయినప్పటికీ.. అవి తరచుగా వచ్చి నిద్రకు భంగం కలిగించి, పగటిపూట ఏకాగ్రత, మానసిక స్థితి, శక్తిని ప్రభావితం చేస్తుంటే.. జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. దాదాపు 4 శాతం మంది పెద్దలు ఈ రకమైన సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలుపుతున్నారు. పీడకలల రుగ్మత ఎందుకొస్తాయి..? నివారణ మార్గాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
దుస్వప్నాలకు కారణాలు:
పీడకలలు లేదా దుస్వప్నాలు రావడానికి అనేక కారణాలు ఉండవచ్చని నిపుణులు అంటున్నారు. వాటిల్లో మానసిక ఒత్తిడి ఒకటి. తీవ్రమైన ఒత్తిడి (Stress) లేదా ఆందోళన (Anxiety) దీనికి ప్రధాన కారణం కావచ్చు. రెండొది మానసిక సమస్యలు. డిప్రెషన్ (Depression), లేదా ఏదైనా తీవ్రమైన గాయం (Trauma) నుంచి కోలుకోకపోవడం (PTSD) దీనిని మరింత పెంచుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా జీవనశైలి సక్రమంగా లేని నిద్ర షెడ్యూల్, ఆల్కహాల్ సేవించడం లేదా నిద్రపోయే ముందు భారీగా ఆహారం తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. కొన్ని రకాల మందులు కూడా దుస్వప్నాలకు కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు.
నైట్ టెర్రర్స్ vs పీడకలలు:
నైట్ టెర్రర్స్ (Night Terrors), పీడకలలు (Nightmares) వేర్వేరు సమస్యలు. నైట్ టెర్రర్స్ అనేది గాఢ నిద్రలో సంభవిస్తుంది. ఇందులో వ్యక్తి అరిచినా లేదా ఉలిక్కిపడి లేచినా తరువాత ఏమి జరిగిందో గుర్తుంచుకోలేరు. కానీ పీడకలలు మాత్రం మేల్కొన్న తర్వాత కూడా చాలా స్పష్టంగా గుర్తుంటాయి. తరచుగా వచ్చే పీడకలలు నేరుగా ప్రాణానికి హాని కలిగించకపోయినా.. అవి మానసిక ఆరోగ్యాన్ని మరింత దిగజార్చి.. ఆత్మహత్య ఆలోచనల ప్రమాదాన్ని పెంచవచ్చు. కాబట్టి వాటిని తగ్గించుకోవడానికి ఈ చిట్కాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. దీని ముఖ్యమైనది నిద్ర దినచర్య. ప్రతిరోజూ ఒక స్థిరమైన నిద్ర షెడ్యూల్‌ను (Fixed Sleep Schedule) పాటించాలి. అంతేకాకుండా విశ్రాంతి ఎక్కువగా తీసుకోవాలి. నిద్రించడానికి ముందు రిలాక్సింగ్ రొటీన్‌ను (Relaxing Routine) అలవాటు చేసుకోవాలి. ఉదాహరణకు, పుస్తకం చదవడం. అయితే నివారించాల్సినవి కూడా ఉన్నాయి. రాత్రి ఆలస్యంగా భారీ భోజనాలు, ఆల్కహాల్ లేదా భయానక కంటెంట్‌ను చూడటం మానుకోవాలని చెబుతున్నారు. ఇమేజ్ రిహార్సల్ థెరపీ (Image Rehearsal Therapy).. పీడకలలకు కొత్త శుభం కార్డును ఊహించుకుని.. దానిని పదేపదే మనసులో రిహార్సల్ చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. వారానికి చాలాసార్లు పీడకలలు వస్తుంటే.. అవి ఎక్కువ కాలం కొనసాగుతుంటే.. లేదా ఏవైనా ఇతర నిద్ర రుగ్మతల (అంటే నిద్రలో గట్టిగా అరవడం, గాలి పీల్చుకోవడానికి కష్టపడటం) లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. సకాలంలో సరైన చికిత్స సమస్య మరింత తీవ్రం కాకుండా నిరోధించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: కనురెప్పల అందం కోసం ఐదు అద్భుతమైన ఇంటి చిట్కాలు మీకోసం..!!
Follow Us