/rtv/media/media_files/2025/10/12/tamarind-seeds-2025-10-12-12-26-04.jpg)
tamarind seeds
Health Tips: తెలుగు ఇళ్లలో చింత పండు అనేది తప్పకుండా ఉంది. సౌత్ వాళ్లు ఎక్కువగా చింత పండు రసం, కూరలు, పులుసు ఇలా ఎక్కువగా వాడుతుంటారు. అయితే ఎవరైనా చింత పండును వాడిన తర్వాత ఆ గింజలను పడేస్తారు. కానీ ఈ గింజల్లో కూడా బోలెడన్నీ పోషకాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర వహిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వీటివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలైనా కూడా పరార్ అయిపోతాయని నిపుణులు అంటున్నారు. అయితే చింత పండు గింజను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఈ స్టోరీలో చూద్దాం.
జీర్ణ సమస్యల నుంచి విముక్తి..
చింత గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. ఎవరైతే అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి విముక్తి పొందుతారని నిపుణులు అంటున్నారు. ఈ గింజల పొడిలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ గింజలతో పొడి తయారు చేసుకుంటే శరీరంలో వాపు తగ్గుతుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు అన్ని నొప్పుల నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. చింత గింజల్లో పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రక్తనాళాల్లో ఒత్తిడిని తగ్గిస్తాయి.
ఇది కూడా చూడండి: Working Shifts: వెరీ డేంజర్.. షిఫ్టుల్లో పనిచేసే వారికి ఈ జబ్బుల సమస్యలు ఎక్కువ.. ఇలా చేయకపోతే ప్రాణాలు పైకే!
గుండె ఆరోగ్యంగా ఉండేలా చేయడంతో పాటు కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రణలో ఉంచుతాయి. అలాగే వీటివల్ల చర్మ సమస్యలు కూడా రావు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ చింత గింజల పొడిని పేస్ట్‌లా తయారు చేసి ముఖానికి అప్లై చేయాలి. దీంతో పిగ్మెంటేషన్ తగ్గుతుంది. ముఖం కూడా కాంతివంతంగా మెరిసిపోతుందని నిపుణులు అంటున్నారు. అలాగే వృద్ధ్యాప్య లక్షణాలను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ గింజల పొడిని వేడి నీటిలో కలిపి తాగడం వల్ల కూడా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చూడండి: Early Morning Food: ఎర్లీ మార్నింగ్ బెస్ట్ ఫుడ్.. డైలీ వారం రోజులు తింటే అనారోగ్య సమస్యలన్నీ పరార్
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.