/rtv/media/media_files/2025/04/13/Z6qog9zgUAKcZ5C5HmCL.jpg)
raisins
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే మాత్రం ఉదయం పూట తీసుకోవాల్సిన ఫుడ్ చాలా ఇంపార్టెంట్. ఉదయం తీసుకునే ఫుడ్ వల్ల ఎలాంటి నీరసం, అలసట వంటివి లేకుండా రోజంతా కూడా ఆరోగ్యంగా ఉంటారు. ప్రతీ పనిలో యాక్టివ్‌గా ఉంటారు. ఏ పని అయినా కూడా చేయాలనే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అయితే ఉదయం పూట తప్పకుండా తీసుకోవాల్సిన వాటిలో ముఖ్యమైన ఫుడ్స్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: Radish Leaves: ముల్లంగి ఆకులు పడేస్తున్నారా..? అయితే ఈ బెనిఫిట్స్ మీరు తెలుసుకోవాల్సిందే!!
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా..
రాత్రి నానబెట్టిన కిస్‌మిస్‌ను ఉదయం పూట తీసుకోవడం వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఇందులో పోషకాలు మెండుగా ఉంటాయి. వీటిలో ఐరన్ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. కిస్‌మిస్‌లో ఫైటో న్యూట్రియంట్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడంలో ముఖ్య పాత్ర వహిస్తాయని నిపుణులు అంటున్నారు. కొందరికి ఎక్కువగా ఆకలి వేస్తుంది. అలాంటి వారు కిస్‌మిస్‌ను తీసుకోవడం వల్ల ఆకలి కొంత వరకు తగ్గుతుంది. అలాగే అలసట, నీరసం కూడా తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. అయితే వీటిని నానబెట్టి లేదా సాధారణంగా తీసుకోవచ్చు. చాలా మంది దీన్ని ఓట్స్ తో కూడా తీసుకుంటారు.
ఇది కూడా చూడండి: Weekly Horoscope: పదేళ్ల తర్వాత శుభయోగం.. కొన్ని గ్రహాల కలయికతో ఈ రాశులకు పట్టబోతున్న అదృష్టం.. ఆ రాశులేవంటే?
అలాగే కిస్‌మిస్ నానబెట్టిన వాటర్ కూడా తీసుకోవడం వల్ల బాడీకి బలం ఏర్పడుతుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటారు. ఎంత నల్లగా ఉన్నవారు అయినా కూడా తెల్లగా మారుతారు. కిస్‌మిస్‌లో బోరాన్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయని నిపుణులు అంటున్నారు. దీనివల్ల బోలు ఎముకల వ్యాధి, ఆస్టియోపొరోసిస్ వంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని నిపుణులు అంటున్నారు. కిస్‌మిస్‌లో విటమిన్ ఎ, బీటా కెరోటిన్, బీటా కెరోటినాయిడ్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మేలు చేయడానికి బాగా ఉపయోగపడతాయి. డైలీ ఉదయం లేదా సాయంత్రం సమయాల్లో వీటిని తీసుకుంటే అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చని నిపుణులు అంటున్నారు.