/rtv/media/media_files/2025/10/11/working-shifts-2025-10-11-09-51-18.jpg)
working shifts
ప్రస్తుతం యువత ఎక్కువగా షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. జనరల్ షిఫ్ట్‌లో వర్క్ చేయకుండా ఉదయం లేదా నైట్ షిఫ్టుల్లో చేస్తున్నారు. దీనివల్ల ఫుడ్‌తో పాటు నిద్ర విషయాల్లో కూడా మార్పులు వస్తున్నాయి. ఆ రంగం.. ఈ రంగం అనే కాకుండా అన్ని రంగాల్లో కూడా ప్రస్తుతం షిఫ్ట్‌లు ఉన్నాయి. దీనివల్ల ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు. డైలీ ఒకటే షిఫ్ట్ ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ షిఫ్టుల మార్పుల వల్ల జీవనశైలిలో మార్పులు చోటుచేసుకుంటాయి. దీంతో అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మహిళల్లో అయితే పిల్లలు పుట్టే సమస్యలు కూడా వస్తున్నాయని అంటున్నారు. షిఫ్టుల వల్ల నిద్ర విషయంలో కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి. వీటివల్ల మహిళలకు రుతుక్రమం, గర్భధారణ వంటి సమస్యలు వస్తాయి. అలాగే మిగతా వారితో పోలిస్తే వీరికి గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహిళలకు నిద్ర తప్పనిసరి. రోజుకి 8 గంటల కంటే ఎక్కువ నిద్ర అవసరం.
ఇది కూడా చూడండి: Papaya Smoothie: జీర్ణక్రియను మెరుగుపరిచే అద్భుతమైన స్మూతీ.. సులభమైన రెసిపీని ట్రై చేయండి
ముందుగానే అన్ని ప్లాన్ చేసుకుంటే..
డైలీ ఒకటే షిఫ్ట్ ఉంటే నిద్ర అన్ని సరైన సమయానికి ఉంటాయి. కానీ వేర్వేరు షిప్టుల వల్ల నిద్ర సమయాల్లో మార్పులు వస్తాయి. దీంతో వారిలో 20 శాతం వ్యాధులు వచ్చే శాతాన్ని పెంచుతాయి. అయితే ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. సెలవు రోజుల్లో కాస్త ఎక్కువగా నిద్రపోవాలి. అంటే వారమంతా నిద్ర కాస్త తక్కువ అయినా సెలవు రోజుల్లో ఎక్కువ గంటలు నిద్రపోవడం వల్ల మీకు కాస్త అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. బాడీకి సరిపడా నిద్ర లేకపోతే మాత్రం తప్పకుండా ఒత్తిడి, కోపం వంటివి పెరుగుతాయి. ఏ పని కూడా సరిగ్గా చేయలేరు. ప్రతీ దాని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అయితే ఎక్కువగా ఒత్తిడికి గురి కాకూడదంటే మీరు అన్ని పనులను ముందుగానే ప్లాన్ చేసుకోండి. ఏ సమయానికి చేయాల్సిన పనిని ఆ సమయానికి చేయండి. దీనివల్ల మీకు కాస్త ఒత్తిడి తగ్గుతుంది. అలాగే షిఫ్టు బట్టి ఎక్కువ గంటలు నిద్రపోయేలా ప్లాన్ చేసుకోండి. దీంతో మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావు. షిఫ్టుల్లో పనిచేసేటప్పుడు ఫుడ్, నిద్ర ఇలా అన్నింట్లో కేర్ తీసుకుంటేనే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని నిపుణులు అంటున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: Palak Paneer: పనీర్‌తో పాలకూర పంచాయితీ తెలుసా..? ఈ తప్పు చేస్తే తిప్పలు తప్పవు!!