వేసవిలో ఈ ఫుడ్ తీసుకుంటే.. అనారోగ్య సమస్యలన్నీ పరార్

వేసవిలో డైలీ చద్దన్నం తినడం వల్ల అనారోగ్య సమస్యలన్నీ తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. చద్దన్నంలోని ప్రోబయోటిక్స్ ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ముఖ్యంగా జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండటం, బరువు తగ్గడం, చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

New Update
మానవ శరీరం ఎంత వేడిని తట్టుకోగలదు..?

health benefits

వేసవిలో శరీరానికి ఆరోగ్యాన్నిచ్చే వాటిని ఎక్కువగా తినాలి. వాటర్ ఎక్కువగా తాగడంతో పాటు పండ్లు, జ్యూస్‌లు, మజ్జిగ, నిమ్మరసం వంటి వాటిని తీసుకోవాలి. అప్పుడే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇప్పుడంటే పండ్లు, జ్యూస్‌లు ఎక్కువగా తాగుతున్నారు. కానీ పూర్వం ఆరోగ్యంగా ఉండటానికి ఎక్కువగా చద్దన్నం తీసుకునేవారు. ముందు రోజు రాత్రిపూట అన్నంలో పెరుగు, పాలు, ఉల్లి, మిర్చి వంటివి వేసి ఉంచుతారు. ఈ అన్నం ఉదయానికి చద్దన్నంగా మారుతుంది. అన్నం పులియడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మరి ఈ చద్దన్నం వేసవిలో తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దాం. 

ఇది కూడా చూడండి: TTD Jobs: టీటీడీలో ఉద్యోగాలు.. నిరుద్యోగ యువతకు చైర్మెన్ అదిరిపోయే శుభవార్త!

జీర్ణ సమస్యలు

చద్దన్నంలోని ప్రోబయోటిక్స్ జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి. ముఖ్యంగా మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి. 

ఇది కూడా చూడండి:  హైదరాబాద్‌కు AICC ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్.. ముందున్న సవాళ్లు ఇవే..! 

రోగనిరోధక శక్తి పెరుగుదల
చద్దన్నం తినడం వల్ల రోగనిరోధక శక్తి పూర్తిగా పెరుగుతుంది. దీంతో మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. 

ఇది కూడా చూడండి: Uttarakhand: ఉత్తరాఖండ్‌లో దారుణం.. హిమపాతంలో చిక్కుకున్న 57 మంది కార్మికులు

వెయిట్ లాస్
చద్దన్నంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో మీ పొట్ట నిండిన ఫీలింగ్ కలుగుతుంది. తక్కువగా ఫుడ్ తీసుకోవడం వల్ల మీరు ఈజీగా బరువు తగ్గుతారు.

చర్మ ఆరోగ్యం
చద్దన్నం వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు