Summer: వేసవిలో భయపెట్టిస్తున్న చర్మ సమస్యలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

వేసవిలో చెమట వల్ల చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి బాడీ ఎక్కువగా చెమటకు గురి కాకుండా చూసుకోండి. అలాగే రోజుకి రెండు సార్లు స్నానం చేయడంతో పాటు అందులో సాల్ట్ వేయాలి. చెమటగా ఉండే దుస్తులను కాకుండా శుభ్రమైన దుస్తులను ధరిస్తే చర్మ సమస్యలు తగ్గుతాయి.

New Update
Summer

Summer Photograph: (Summer)

Summer Skin Care: వేసవిలో ఎండ తీవ్రత అధికంగా ఉండటం వల్ల చెమట ఎక్కువగా వస్తుంది. దీంతో కొందరికి చర్మ సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా తొడల అంచులు, చంకలు, మెడ, చెవుల చుట్టూ దురద పెడుతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా చెమట వల్ల తప్పకుండా చర్మ సమస్యలు వస్తాయి. అయితే వేసవిలో ఎలాంటి చర్మ సమస్యలు రాకుండా ఉండాలంటే.. తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో మరి ఈ స్టోరీలో చూద్దాం. 

ఇది కూడా చూడండి: Lalith Modi: లలిత్ మోదీకి వనువాటు పౌరసత్వం..ఎంతకు కొన్నారో తెలుసా?

చెమట పట్టకుండా జాగ్రత్త వహిస్తే..

కొందరికి చెమట ఎక్కువగా పడుతుంది. చేతులు, కాళ్లు అయితే ఎల్లప్పుడూ కూడా తడిగా ఉంటాయి. ఇలా కాకుండా శరీరాన్ని పొడిగా ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఎక్కువ చెమట పట్టకుండా ఉంటే ఎలాంటి చర్మ సమస్యలు రావు. అలాగే వేసవిలో తొందరగా చెమట వస్తుంది. కాబట్టి కేవలం ఒక్కసారి మాత్రమే దుస్తులను ధరించండి. మళ్లీ వాటిని శుభ్రం చేసిన తర్వాతే ఉపయోగించండి. 

ఇది కూడా చూడండి: Horoscope Today: ఈ రోజు ఈ రాశి వారికి సొంత నిర్ణయాలు నష్టాన్ని తెచ్చిపెడతాయి.. జాగ్రత్త!

ఎప్పటికప్పుడూ బెడ్ షీట్లు, టవల్స్ వాష్ చేయండి. అలాగే రోజుకి రెండు సార్లు తప్పకుండా స్నానం చేయండి. స్నానం చేశాక శుభ్రం చేసిన దుస్తులను మాత్రమే ధరించండి. మీకు స్నానం చేసే బకెట్ వాటర్‌లో డెటాల్ లిక్విడ్ కాస్త వేయండి. ఇలా స్నానం చేయడం వల్ల శరీరంపై ఉన్న మురికి అంతా కూడా తొలగిపోతుంది. డెటాల్ లేని వాళ్లు వాటర్‌లో ఉప్పువేసి అయినా కూడా స్నాంన చేయవచ్చు. ఉప్పుు వేసి స్నానం చేయడం వల్ల నరదిష్టి కూడా తొలగిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చూడండి: TG News: మహిళలపై సీఎం రేవంత్ వరాల జల్లు.. ఇందిరా మహిళాశక్తి మిషన్-2025 పాలసీ ప్రకటన!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. పూర్తి వివరాలకు నిపుణులను సంప్రదించండి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు