Sleeping Tips: నిద్రపోయేటప్పుడు వీటిని దగ్గర పెట్టుకున్నారో.. ఇక అంతే సంగతులు

నిద్రపోయే గదిలో పర్సు, వాటర్ బాటిల్, నూనె, మందులు వంటివి పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటిని పక్కన పెట్టి నిద్రపోతే నెగిటివ్ ఎనర్జీ వస్తుందని అంటున్నారు. అలాగే ఎల్లప్పుడూ కూడా ఏదో ఒక సమస్య, అనారోగ్య పాలవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

New Update
sleep

sleep

Sleeping Tips: నిద్ర అనేది ప్రతీ వ్యక్తికి ముఖ్యమైనది. ఎంత హాయిగా నిద్రపోతే అంతకంటే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతుంటారు. అయితే కొందరు నిద్రపోయే పక్కన కొన్ని వస్తువులను పెడుతుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను పెట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ(Negative Energy) వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే నిద్రపోయేటప్పుడు పక్కన పెట్టకూడని ఆ వస్తువులు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. 

ఇది కూడా చూడండి: HYDRAA Jobs: హైడ్రాలో 357 ఉద్యోగాలు.. ఆ మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక!

నూనె

బెడ్ రూమ్‌లో నూనె(Oil)ను ఉంచకూడదు. దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. జీవితంలో ఎలాంటి అభివృద్ధి కూడా ఉండదని నిపుణులు చెబుతున్నారు.

మందులు

బెడ్ దగ్గర మందుల(Medicines)ను పెట్టడం వల్ల మీరు ఎల్లప్పుడూ కూడా అనారోగ్యంతో ఉంటారని నిపుణులు అంటున్నారు. ఎప్పుడూ ఏదో ఒక సమస్య వెంట వస్తూనే ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చూడండి: BRS vs Congress: రాజలింగమూర్తి హత్య కేసుపై స్పందించిన గండ్ర వెంకట రమణారెడ్డి..

పర్సు

డబ్బును పడుకునే దగ్గర పెట్టుకోవడం వల్ల ఇంట్లో పేదరికం వస్తుందట. ఎట్టి పరిస్థితుల్లో కూడా పర్సు(Purse)ను నిద్రపోయే గదిలో అసలు పెట్టకూడదు.

ఇది కూడా చూడండి: Aaryan Shukla: 14ఏళ్ల మహారాష్ట్ర కుర్రాడు.. ఒకేరోజు 6 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్స్ ఎలా క్రియేట్ చేశాడంటే..?

వాటిల్ బాటిల్

చాలా మంది వాటర్ బాటిల్‌ను పక్కనే పెట్టుకుని నిద్రపోతుంటారు. ఎందుకంటే మధ్యలో లేచి వాటర్ తాగే అలవాటు ఉండటంతో పెడతారు. అయితే ఇలా పెట్టడం వల్ల ప్రతికూల శక్తులు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. పూర్తి వివరాలు కోసం దీనికి సంబంధించిన నిపుణులను సంప్రదించగలరు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు