Viral Video: కఠిన కారాగారశిక్ష పడిన ఓ ఖైదీ శిక్ష పూర్తయ్యాక విడుదలై జైలు ముందే చిందేశాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఓ దాడి కేసులో యూపీలోని కన్నౌజ్‌కు చెందిన శివ అనే వ్యక్తికి ఏడాది జైలు శిక్ష పడింది. అంతేకాకుండా వెయ్యి రూపాయల జరిమానా సైతం విధించారు. అసరాగా నిలిచే కుటుంబ సభ్యులు లేక, బెయిల్ ఇవ్వడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు.
భవిష్యత్‌లో నేరాలు చేయబోనని..
దీంతో శివ ఏడాది పాటు జైల్లోనే గడపాల్సి వచ్చింది. చివరికి ఓ ఎన్జీవో సంస్థ శివకు సాయం అందించడానికి ముందుకొచ్చింది. శివను బయటికి తీసుకొచ్చారు. జైలులోనే శివ చదవడం, రాయడం నేర్చుకున్నాడు. అంతేకాకుండా భవిష్యత్‌లో ఎలాంటి నేరాలు చేయబోనని చెబుతున్నాడు. అయితే జైలు నుంచి విడుదలయ్యే సమయంలో జైలు బయట పాటకు స్టెప్పులేశాడు. మైకేల్ జాక్సన్ స్టెప్పులతో దుమ్ములేపాడు.
Also Read: నువ్వులు తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుందా?
Also Read: సర్కార్ స్కూళ్లలో స్పోకెన్ ఇంగ్లీష్.. అక్కడి నుంచే స్టార్ట్!
ఇదంతా చూసిన పోలీసులు, న్యాయవాదులు అవాక్కయ్యారు. ఈ వీడియోను సమాజ్‌వాదీ కార్యకర్త కేపీ పాఠక్ షేర్ చేశారు. దీంతో వైరల్‌గా మారింది. శివ డ్యాన్స్ చూసిన నెటిజెన్లు డ్యాన్స్ స్కిల్స్ చూసి మెచ్చుకుంటున్నారు. మొత్తానికి స్వేచ్ఛ వచ్చింది బ్రో అంటూ కామెంట్లు పెడుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.
Also Read: ఛీ వీళ్లు మనుషులా?.. తల్లిని శ్మశానంలో వదిలేశారు
Also Read:పెరుగుతోన్న వాయు కాలుష్యం.. ఏటా 15 లక్షల మంది మృతి