Periods In Fever: నెలసరిలో తీవ్ర జ్వరం.. వామ్మో అమ్మాయిలకు ఇంత ప్రమాదమా?

నెలసరిలో తీవ్ర జ్వరం వస్తే ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. పీరియడ్స్‌ టైంలో వచ్చిన ఫీవర్ కొన్ని రోజుల వరకు తగ్గకుండా అలా ఉంటుందని అంటున్నారు. అయితే ఇది హార్మోన్ల మార్పుల వల్ల వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

New Update
Periods in Fever

Periods in Fever

మహిళలకు నెలసరి సమయంలో కడుపు నొప్పి, నడుం నొప్పి, కాళ్లు నొప్పులు వంటివి సహజంగా వస్తుంటాయి. అయితే అందరి మహిళల్లో ఈ లక్షణాలు కనిపించవు. సాధారణంగా పీరియడ్స్ సమయంలో మహిళలు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఈ సమయంలో మూడ్ స్వింగ్స్, చిరాకు వంటివి ఉంటాయి. కొందరు మహిళలకు ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఎక్కువగా జ్వరం, దగ్గు, జలుబు వంటివి వస్తుంటాయి. సాధారణంగా ఈ జ్వరం వస్తే కొన్ని రోజులకు తగ్గిపోతుంది. కానీ నెలసరి సమయంలో జ్వరం వస్తే మాత్రం అది తీవ్రంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. పీరియడ్స్ టైంలో జ్వరం వస్తే మాత్రం ఎన్ని మందులు వాడినా కూడా కొన్ని రోజుల వరకు తగ్గదని నిపుణులు అంటున్నారు. ఇలా జ్వరం రాకుండా ఉండాలంటే ముందు నుంచే కాస్త జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీన్ని పీరియడ్ ఫ్లూ అంటారు. మరి ఈ సమస్య ఎందుకు వస్తుంది? రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

హార్మోన్ల మార్పుల వల్ల..

కొందరి హార్మోన్ల మార్పుల వల్ల ఈ పీరియడ్ ఫ్లూ వస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే కొందరికి జ్వరం వస్తే మరికొందరికి అలసట, నీరసం, జలుబు, దగ్గు, వాంతులు, మలబద్ధకం వంటివి వస్తాయి. హార్మోన్లతో పాటు బాడీకి విశ్రాంతి లేకపోవడం, వ్యాయామం లేకపోవడం, నిద్ర లేకపోవడం వంటి కారణాల వల్ల వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఒక్కోక్కరిలో ఒక్కో కారణం వల్ల వేర్వేరు లక్షణాలు కనిపిస్తాయి. ఇలా పీరియడ్ ఫ్లూ రాకుండా ఉండాలంటే తప్పకుండా ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నెలసరిలోనే ఎక్కువగా ఫీవర్ వస్తుంటే ఆకుకూరలు అధికంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Non-veg side effects: ప్రతిరోజూ మాంసం తింటున్నారా..? నాన్-వెజ్ ప్రియులు ఆరోగ్యంపై జాగ్రత్త

వీటిలోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాగే బాడీ డీహైడ్రేట్ అయితే ఇమ్యూనిటీ పవర్ తగ్గి ఫీవర్ వస్తుంది. కాబట్టి బాడీకి సరిపడా వాటర్ తీసుకోవాలి. దీనివల్ల శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. కొందరికి అసలు వ్యాయామం ఉండదు. దీనివల్ల బాడీకి ఎలాంటి బాడీ చెమట ఎక్కదు. దీనివల్ల సరిగ్గా రక్తప్రసరణ జరగకుండా అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఇలాంటి సమస్యలు ఉన్నవారు డైలీ వ్యాయామం చేయడంతో పాటు యోగా, మెడిటేషన్ వంటివి చేయాలని నిపుణులు చెబుతున్నారు. వీటివల్ల నెలసరిలో ఎలాంటి సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండటంతో పాటు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. అలాగే ఒత్తిడి నుంచి విముక్తి పొందుతారని చెబుతున్నారు.

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. పూర్తి వివరాలు కోసం మీకు సమీపంలోని నిపుణులను సంప్రదించగలరు.

ఇది కూడా చూడండి:  Cancer: ఆ ఎసిడిటీ టాబ్లెట్లతో క్యాన్సర్ ముప్పు.. కేంద్రం షాకింగ్ ప్రకటన!

Periods in Fever | latest-telugu-news | girls | healthy life style

Advertisment
తాజా కథనాలు