Turmeric: పసుపు తింటే ప్రాణాలే పోతాయ్.. ఎందుకో తెలుసుకోండి! ప్రతిరోజు ఇంతలా ఉపయోగించే పసుపులో విషం ఉందని మీకు తెలుసా..? ఇదేదో నోటి మాట కాదు.. సైంటిస్టులు చెప్పిన షాకింగ్ నిజాలు. భారత్‌లోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన పసుపు నమూనాలలో సీసం అధిక మోతాదులో ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. By Archana 19 Nov 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update turmeric షేర్ చేయండి Turmeric: ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు పసుపు మన జీవితంలో నిత్యం భాగమైపోయింది. పసుపు లేకుండా వంటలే ఉండవు.. అంతేందుకు పసుపు లేకుండా చాలా పెళ్ళిళ్లు కూడా జరగవు.. అయితే ప్రతిరోజు ఇంతలా ఉపయోగించే పసుపులో విషం ఉందని మీకు తెలుసా..? ఇదేదో నోటి మాట కాదు.. సైంటిస్టులు చెప్పిన షాకింగ్ నిజాలు. అధ్యయనాల్లో షాకింగ్ నిజాలు సైన్స్ ఆఫ్ ది టోటల్ ఎన్విరాన్‌మెంట్ అనే జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. భారత్‌లోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన పసుపు నమూనాలలో సీసం అధిక మోతాదులో ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అంతే కాదు..సాధారణంగా రబ్బరు, పెయింట్, ప్లాస్టిక్ రంగులు తయారీలో ఉపయోగించే లెడ్ క్రొమేట్‌ను పసుపులో కలుపుతున్నారు..! దీని వల్ల అనేక రోగాలు తప్పవు! పసుపులో లెడ్ లెడ్ అనేది రసాయనిక లోహం.. దీన్నే సీసం అని కూడా పిలుస్తారు. ఈ లోహం మన శరీరంలోకి ప్రవేశిస్తే దాని వల్ల మెదడు, గుండె, కిడ్నీలు, మూత్రపిండాలు పాడవుతాయి. అంతేకాదు జీర్ణక్రియ కూడా మందగిస్తుంది. ముఖ్యంగా పిల్లల్లో మెదడు ఎదుగుదల దెబ్బతింటుంది. ఆలోచించే తత్వం తగ్గుతుంది. మెమరీ లాస్ కూడా జరుగుతుంది. అటు పెద్దల్లో అధిక సీసం మోతాదు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. కడుపు నొప్పి, వాంతులు, ఆకలి తగ్గడం లాంటి సమస్యలకు అధిక మొత్తంలో సీసం కారణమవుతుంది. ముఖ్యంగా అనేక కిడ్నీ వ్యాధులకు సీసం ప్రధాన కారణం అని చెప్పవచ్చు. Also Read: Bunny VS Pawan: అల్లు అర్జున్ ముందు పవన్ నథింగ్! ప్రాణాంతక వ్యాధులు సీసం అధికంగా తీసుకుంటే గుండెకు ముప్పు కలుగుతుంది. ఇది రక్తపోటును పెంచి, గుండె జబ్బులకి దారితీస్తుంది. సీసం శరీరంలో హీమోగ్లోబిన్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది. ఈ కారణంగా రక్తహీనత.. అంటే అనేమియా వచ్చే ప్రమాదం ఉంటుంది. అలసటగా ఉండడం బలహీనంగా మారిపోయినట్టు ఫీలింగ్ కలగడం మొదలవుతుంది. అంతేకాదు అధిక సీసంతో శారీరక సమస్యలే కాదు మానసిక సమస్యలు కూడా వస్తాయి. చిరాకు, తలనొప్పులు, నిద్రలేమి లాంటి లక్షణాలు కనిపిస్తాయి. Also Read: మిస్ యూనివర్స్ 2024.. 21ఏళ్ల భామకు విశ్వసుందరి కీరిటం! ఇక భారత్‌లోని పట్నా, గువాహటి, చెన్నైతో పాటు పాకిస్థాన్‌లోని కరాచీ, పెషావర్ లాంటి ప్రాంతాల పసుపు నమూనాల్లో సీసం అధికంగా ఉండటాన్ని పరిశోధకులు నిర్ధారించారు. ఈ పసుపు నమూనాల్లో 1,000 మైక్రోగ్రామ్ పర్ గ్రామ్ సీసం ఉండటం కలవరపరుస్తుంది. భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ- FSSAI ప్రకారం, పసుపులో అనుమతించిన సీసం పరిమితి కేవలం 10 మైక్రోగ్రామ్ పర్ గ్రామ్ మాత్రమే. కానీ ఈ నమూనాలలో అది ఏకంగా 100 రెట్లు ఎక్కువగా విస్మయాన్ని కలిగిస్తోంది. అంటే మన శరీరం ఎంత కల్తీ అవుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇటివలీ కాలంలో అనేక రకాల భారతీయ ఆహార పదార్థాల్లో కల్తీ జరుగుతున్న విషయాలు బయటకొస్తున్నాయి. గత ఏప్రిల్‌లో యూరోపియన్ ఫుడ్‌సెఫ్టీ అధికారులు 527 భారతీయ ఆహార పదార్థాలలో క్యాన్సర్ కారక రసాయనాలను కనుగొన్నారు. ఇలా ప్రతీదాంట్లోనూ కల్తీ ఉండడం చూస్తుంటే ఏం తినాలో అర్థంకాని దుస్థితి ప్రజలది..! ఏం తిన్నా ఏదో ఒక రోగం వస్తుందని చెబుతున్నారు.. ప్రతీ పదార్థాంలోనూ కల్తీ ఉందంటున్నారు.. మరి ఏం తినాలో ఏంటో..! గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. Also Read: కీర్తిసురేష్ పెళ్లి ఫిక్స్.. వరుడు మరెవరో కాదు..! Also Read: AP: ఏపీలో ఆ ఉద్యోగులందరూ తొలగింపు..సర్కార్ కీలక నిర్ణయం! #scientists #Turmeric Effects #turmeric-side-effects #turmeric మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి