Bunny VS Pawan: అల్లు అర్జున్‌ ముందు పవన్‌ నథింగ్‌!

అల్లు అర్జున్‌ న‌టించిన పుష్ప-2 ట్రైల‌ర్ విడుద‌లైంది. ఈ ట్రైల‌ర్‌ను బిహార్ రాజ‌ధాని పాట్నాలో లాంచ్ చేశారు.ఈ కార్య‌క్ర‌మానికి అభిమానులు భారీగా వచ్చారు.దీంతో వారిని ప‌వ‌న్ స‌భ‌కు వ‌చ్చే జ‌నంతో పోల్చుతూ వైసీపీ నాయకులు సోష‌ల్ మీడియా ట్రోల్ చేస్తున్నారు.

New Update
Allu Arjun : కన్నీగాడు నమ్మక ద్రోహి.. అల్లు అర్జున్‌పై దుమ్మెత్తిపోస్తున్న మెగా ఫ్యాన్స్!

Bunny VS Pawan:

పాలిటిక్స్ ఎవ్వరినైనా శత్రువులుగా మార్చేస్తుంది. అది ఫ్యామిలీలోనైనా, ఫ్రెండ్స్ అయినా ఎవ్వరినైనా.. ఎన్టీఆర్ ఫ్యామిలీలోనే వేర్వేరు పార్టీల్లో అంటే టీడీపీ-బీజేపీ పార్టీలలో కొనసాగుతున్నారు. వైసీపీకి జగన్, కాంగ్రెస్‌కి షర్మిల ఇద్దరూ ఆస్తుల విషయంలో గొడవ పడుతున్నారు. ఇక మెగా ఫ్యామిలిలో పవన్ కళ్యాణ్ వెనుక అందరూ ఉన్నా అల్లు అర్జున్ పవన్ విషయంలో ప్రవర్తించే తీరు ఎవరికీ అర్థం కాదు. పవన్‌కి సపోర్ట్ అంటూనే నంద్యాల వెళ్లి వైసీపీ అభ్యర్థిని సపోర్ట్ చెయ్యడం పవన్ అభిమానులకి  మండింది, అంతేకాదు మెగా ఫ్యామిలీలోనూ అల్లు అర్జున్‌పై నెగిటివిటీ మొదలైంది. 

Also Read:  Big Breaking: జనవరిలో పంచాయతీ ఎన్నికలు..?

తాజగా హీరో బ‌న్నీ న‌టించిన పుష్ప-2 ట్రైల‌ర్ విడుద‌లైంది. ఈ ట్రైల‌ర్‌ను బిహార్ రాజ‌ధాని పాట్నాలో లాంచ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి భారీగా అభిమానులు త‌ర‌లి వెళ్లారు. అయితే జ‌న సందోహాన్ని, ప‌వ‌న్ స‌భ‌కు వ‌చ్చే జ‌నంతో పోల్చుతూ వైసీపీ నాయకులు సోష‌ల్ మీడియా ట్రోల్ చేయ‌డం గ‌మ‌నార్హం.

Also Read: Delhi: ఇంకా రాజధానిగా ఢిల్లీ అవసరమా..?

ప‌వ‌న్‌కు కేవ‌లం ఏపీలో మాత్రమే జ‌నం వ‌స్తార‌ని, కానీ బ‌న్నీకి ఉత్తరాది రాష్ట్రంలోని పాట్నాలో కూడా పోటెత్తార‌ని నెటిజ‌న్లు కామెంట్స్ చేయ‌డం గ‌మ‌నార్హం. ఇలా పుష్ప హీరోకి మ‌ద్దతుగా పోస్టులు పెడుతున్న వాళ్లలో వైసీపీ అభిమానులు ఉండ‌డం విశేషం. బ‌న్నీకి వైసీపీ అండ‌గా నిల‌బ‌డడానికి కార‌ణం లేక‌పోలేదు. ఎన్నిక‌ల ముందు బ‌న్నీ నంద్యాల‌లోని త‌న స్నేహితుడైన శిల్పా ర‌విచంద్రారెడ్డి ఇంటికెళ్లారు. అనుమ‌తి లేకుండా వైసీపీ నాయ‌కుడు శిల్పాకు మ‌ద్దతుగా బ‌న్నీ ప్రచారానికి వెళ్లాడంటూ కూట‌మి నేత‌లు ఫిర్యాదు చేశారు. 

Also Read: AP: ఏపీలో ఆ ఉద్యోగులందరూ తొలగింపు..సర్కార్‌ కీలక నిర్ణయం!

ఎన్నిక‌ల సంఘం సీరియ‌స్‌గా తీసుకుని కేసు పెట్టాల‌ని నంద్యాల ఎస్పీని ఆదేశించింది. ఇటీవ‌లే ఆ కేసు కొట్టేయాల‌ని బ‌న్నీ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. బ‌న్నీకి హైకోర్టులో ఊర‌ట ల‌భించింది. ఈ కేసును కొట్టేసిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు వైసీపీకి మ‌ద్దతుగా బ‌న్నీ ప్రచారానికి వెళ్లారని, ఆయ‌న‌పై నాగ‌బాబు ఘాటు పోస్టు పెట్టారు. దీంతో బ‌న్నీ, జ‌న‌సేన శ్రేణుల మ‌ధ్య చిన్నపాటి వార్ జ‌రిగింది. చివ‌రికి నాగ‌బాబు త‌న పోస్టును డిలీట్ చేయ‌డంతో స‌మ‌స్య స‌ర్దుమ‌ణిగింది. 

Also Read: Sabarimala: శబరిమలకు పోటెత్తిన స్వాములు..దర్శనానికి 10 గంటల సమయం!

ఇటీవ‌ల ప‌వ‌న్‌క‌ల్యాణ్ గురించి బ‌న్నీ మంచి మాట‌లు చెప్పారు. దీంతో విభేదాలు తొలిగాయ‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. అయితే పాట్నాలో బ‌న్నీ సినిమా ట్రైల‌ర్ లాంచ్‌కు భారీగా జనం త‌ర‌లి రావ‌డాన్ని చూపుతూ, వైసీపీ ప‌వ‌న్‌ను ట్రోల్ చేస్తోంది. పిఠాపురం అనుకుంటున్నారా, మహారాష్ట్ర అనుకుంటున్నారా అది పాట్నా, జన సునామీ చూడండి, మెగా ఫ్యామిలిలో ఒంటరిగా ఎదిగాడు, మెగాస్టార్ అండ లేకుండా పాట్నా ఈవెంట్ సక్సెస్ చేసాడు.

 మీ పవన్ కళ్యాణ్‌కి వచ్చే జనం పాట్నా బన్నీ అభిమానుల ముందు ఎంత, పవన్ ముందు అల్లు అర్జున్ చిన్నోడు అనుకుంటున్నారేమో.. అల్లు అర్జున్ ముందు పవన్ నథింగ్ అంటూ వైసీపీ సోషల్ మీడియాలో మెగా అభిమానులను రెచ్చగొడుతోంది. మరోవైపు పుష్ప-2 ట్రైలర్‌ అదిరిపోయిందంటూ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సహా పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా అల్లు అర్జున్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా మెగా ఫ్యామిలీ నుంచి ఏ ఒక్కరూ పుష్ప-2 గురించి స్పందించలేదు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయితేజ్, నిహారిక ఇంకా మౌనంగానే ఉన్నారు. ఈ పరిణామాలు మెగా ఫ్యామిలీలో విభేదాలను మరోసారి బయటపెట్టాయని నెటిజన్లు అంటున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు