కీర్తిసురేష్ పెళ్లి ఫిక్స్.. వరుడు మరెవరో కాదు..!

నటి కీర్తి సురేష్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. కీర్తి వివాహం వచ్చేనెల గోవాలో జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. వరుడు ఆమె తండ్రి సురేష్ ఫ్యామిలీకి చాలా ద‌గ్గ‌రి బంధువ‌ని.. అందుకే కీర్తి కూడా ఒకే చేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

New Update
keerthi suresh marriage

keerthi suresh marriage

keerthi suresh marriage:  మహానటి సావిత్రి తర్వాత.. అందం, అభినయంతో ఈ తరం సావిత్రిగా పేరు తెచ్చుకున్న అందాల తార కీర్తి సురేష్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలతో బిజీగా ఉంది. హిందీలో వరుణ్ ధావన్ సరసన పాన్ ఇండియా ఫిల్మ్  'బేబీ జాన్', తమిళ్లో జెకే  చంద్రు దర్శకత్వంలో రివాల్వర్ రీటా, ఆ తర్వాత గణేష్ రాజా డైరెక్షన్లో 'కన్నివేడి' చిత్రాలు లైనప్ లో ఉన్నాయి. 

గోవాలో కీర్తి సురేష్ పెళ్లి..?

ఇది ఇలా ఉంటే కీర్తి సురేష్ పెళ్లి వార్త మరోసారి నెట్టింట వైరల్ గా మారింది. త్వరలోనే మహానటి పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మ్యాచ్ ఆమె తల్లిదండ్రులు నిర్ణయించిందని .. దానికి కీర్తి కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. వరుడు ఆమె తండ్రి సురేష్ ఫ్యామిలీకి చాలా ద‌గ్గ‌రి బంధువట. వీరి పెళ్లి గోవాలో జరగబోతుందని సమాచారం. కానీ  దీనికి సంబంధించిన కీర్తి, ఆమె కుటుంబ సభ్యులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 

Also Read:పవన్‌పై బన్నీ సంచలన వ్యాఖ్యలు.. అన్‌స్టాపబుల్‌ షోలో బాలకృష్ణతో అల్లు అర్జున్ రచ్చ రచ్చ!

రెండేళ్ల క్రితం సింగర్ రవిచందర్‌తో 

అయితే రెండేళ్ల క్రితం కూడా కీర్తి పెళ్ళికి సంబంధించి పలు రకాల వార్తలు వైరలైన సంగతి తెలిసిందే.  ప్రముఖ రాజకీయ నాయకుడిని పెళ్లిచేసుకోబోతుందని మొదట ప్రచారం జరిగింది. ఆ తర్వాత సింగర్ అనిరుధ్ రవిచందర్‌ను డేట్ చేస్తున్నట్లు  వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని కీర్తి తండ్రి సురేష్ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. మరి ఇప్పుడు వైరల్ అవుతున్న వార్తలో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది. 

Also Read: పెళ్ళైన నాలుగు నెలలకే రాధికా ఆ విషయంలో సంచలన నిర్ణయం..!

Advertisment
తాజా కథనాలు