తెల్ల ఉల్లి vs ఎర్ర ఉల్లి.. రెండింటిలో ఏది మంచిది?

ఎర్ర, తెల్ల ఉల్లి రెండు కూడా ఆరోగ్యానికి మంచివని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎర్ర ఉల్లితో పోలిస్తే తెల్ల ఉల్లిలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. ఇవి మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

New Update
red onion vs white onion

red onion vs white onion Photograph: (red onion vs white onion)

ఉల్లి చేసిన మేలు తల్లి చేయదనే సామెత అందరికీ తెలిసిందే. ఆరోగ్య ప్రయోజనాలకు ఉల్లి బాగా ఉపయోగపడుతుంది. వెజ్ కర్రీల కంటే నాన్‌వెజ్ కర్రీల్లో అయితే అసలు ఉల్లి లేకపోతే వంటలు టేస్ట్ కూడా ఉండవు. అయితే మనలో చాలా మందికి ఎర్ర ఉల్లి గురించి మాత్రమే తెలుసు. కానీ తెల్ల ఉల్లి కూడా మార్కెట్‌లో ఉంది. అసలు తెల్ల ఉల్లి మంచిదా లేకపోతే ఎర్ర ఉల్లి మంచిదా? అనే పూర్తి విషయాలు ఈ స్టోరీలో చూద్దాం.

ఇది కూడా చూడండి: Mastan sai: టాలీవుడ్ To పాలిటిక్స్ ఎవరిని వదలని మస్తాన్ సాయి: టోటల్ లిస్ట్ ఆడియో వైరల్!

చర్మ ఆరోగ్యానికి కూడా..

ఎర్ర ఉల్లిపాయ తినడం వల్ల శరీరంలో వ్యర్థ పదార్థాలు అన్ని కూడా బయటకు వెళ్లిపోతాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అలాగే క్యాన్సర్ నిరోధక లక్షణాలను తగ్గిస్తుంది. అలాగే చర్మ ఆరోగ్యం మెరుగుపడుుతంది. చర్మం పగుళ్లు, ముడతలు అన్ని కూడా క్లియర్ అవుతాయి. జీవక్రియ మెరుగుపడటంతో పాటు రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది.

ఇది కూడా చూడండి: Sankranthiki Vasthunam: వెంకీ మామ ఫ్యాన్స్ గెట్ రెడీ.. యూట్యూబ్ లో 'గోదారి గట్టు మీద' సాంగ్ ఫుల్ వీడియో

వీటితో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అయితే ఎర్ర ఉల్లితో పాటు తెల్ల ఉల్లి కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎర్ర ఉల్లిపాయల్లో కంటే తెల్ల ఉల్లిపాయల్లో ఎక్కువగా నీరు, చక్కెర శాతం ఉంటాయి. అలాగే ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకం, ఎసిడిటీ వంటి కడుపు సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.  

ఇది కూడా చూడండి: Pakistan PM : పరువు తీయొద్దు .. భారత్ పై గెలవండి..కప్ తీసుకురండి :  పాక్ ప్రధాని

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు