Kannappa movie: Prabhas look
Kannappa movie: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా భారీ అంచనాలతో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'కన్నప్ప'. మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో సిద్దమవుతున్న ఈ స్టోరీలో పలువురు బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ స్టార్లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో రెబెల్ స్టార్ ప్రభాస్ కూడా ఓ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు.
Also Read: Bigg Boss: ఫ్యాన్స్ కి షాక్! ఇకపై బిగ్ బాస్ కి కొత్త హోస్ట్.. షోకు గుడ్ బై చెబుతూ హీరో పోస్ట్!
ప్రభాస్ లుక్
దీంతో సినిమాలో ప్రభాస్ లుక్ ఎలా ఉండబోతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ఈ క్రమంలో తాజాగా ప్రభాస్ లుక్ రిలీజ్ చేయగా.. నెట్టింట వైరల్ గా మారింది. కన్నప్పలో ప్రభాస్ 'రుద్ర' పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు. ప్రళయకాల రుద్రుడు, త్రికాల మార్గదర్శకుడు, శివాజ్ఞ పరిపాలకుడు అంటూ ప్రభాస్ పోస్టర్ షేర్ చేశారు.
ॐ The Mighty 'Rudra' ॐ
— Kannappa The Movie (@kannappamovie) February 3, 2025
Unveiling Darling-Rebel Star 𝐏𝐫𝐚𝐛𝐡𝐚𝐬 as '𝐑𝐮𝐝𝐫𝐚' 🔱, a force of divine strength, wisdom, and protector in #Kannappa🏹. ✨
Embark on an extraordinary journey of devotion, sacrifice, and unwavering love.
Witness this epic saga on the big screen… pic.twitter.com/wcg7c3ulxd
ఇది ఇలా ఉంటే .. ఇటీవలే కన్నప్ప నుంచి అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ పోస్టర్లు రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్షయ్, కాజల్ శివపార్వతుల పాత్రలో కనిపించనున్నారు. మంచు విష్ణు లీడ్ రోల్లో నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని అవా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. కన్నప్ప ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Also Read: Suryapet Murder: చంపింది నాన్నమ్మనే.. ప్రైవేట్ పార్ట్స్‌ను కసితీరా తొక్కి.. భార్గవి సంచలన నిజాలు!