గ్రామీ అవార్డ్స్ వేడుకల్లో బట్టలు విప్పేసిన ర్యాప్ సింగర్ భార్య ఫొటో షూట్

లాస్ ఏంజెలెస్‌‌లో జరిగిన గ్రామీ అవార్డ్స్ 2025 వేడుకల్లో అమెరికన్ ర్యాప్ సింగర్ కాన్వే వెస్ట్, ఆయన భార్య బియాంకా సెన్సోరి వివాదంగా మారారు. అవార్డు సెర్మనీలో బియాంకా సెన్సోరి దుస్తులు విప్పి ఫొటోలకు స్టిల్ ఇచ్చింది. దీంతో వారిని ఈవెంట్ నుంచి పంపించారు.

New Update
bianca censori

bianca censori Photograph: (bianca censori)

గ్రామీ అవార్డ్స్ 2025 ప్రదానోత్సవం వేడుకలు లాస్ ఏంజెలెస్‌లో ఆదివారం జరిగాయి. ఈ ఈవెంట్‌లో అమెరికన్ ర్యాప్ సింగర్ జంట రచ్చ రచ్చ చేశారు. వారి వింత ప్రవర్తన అక్కడున్నవారందనిరి ఆశ్చర్యానికి గురిచేసింది. గ్రామీ అవార్డ్ 2025 వేడుకలకు వచ్చిన అమెరికన్ ర్యాపర్ కాన్వే వెస్ట్, ఆయన భార్య బియాంకా సెన్సోరి వివాదంలో నిలిచారు. అవార్డ్ సెరిమనీ ఫంక్షన్‌లో బియాంకా సెన్సోరి దుస్తువు అన్నీ విప్పి ఫొటోలకు ఫోజ్ ఇచ్చారు. బియాంకా సెన్సోరి ఓ ఆర్కిటెక్ట్, 2022లో అమెరికన్ ర్యాప్ సింగర్ కాన్వే వెస్ట్‌ను వివాహం చేసుకుంది. కాన్వే వెస్ట్ గ్రామీ అవార్డ్స్ 2025లో బెస్ట్ ర్యా్ప్ సాంగ్‌కు నామినేట్ అయ్యాడు. అందుకే ఆయన భార్యతో కలిసి ఈ అవార్డ్ ఫంక్షన్‌కు వచ్చారు. 

Also Read: Anasuya: అంతా నా ఇష్టం.. బికినీలో కాదు.. మొత్తం విప్పి తిరుగుతా మీకెందుకూ? : అనసూయ

కాన్వే వెస్ట్, ఆయన భార్య బియాంకా సెన్సోరి వేడుకల్లో వింతగా ప్రవర్తించారు. రెడ్ కార్పెట్‌పై నడిచి వెళ్లిన బియాంక ఉన్నట్టుండి ఆమె దుస్తువులు తీసేని ఫొటోలకు ఫోజ్ ఇచ్చారు. ఆమె అలా చేస్తున్నప్పుడు కాన్వే వెస్ట్ పక్కనే ఉన్నాడు. బ్లాక్ కోట్ ధరించి వచ్చిన ఆమె దాన్ని తొలగించి ఫొటోలకు స్టిల్ ఇచ్చారు. దీంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. వెస్ట్ 2024లో వాల్చర్స్ అనే ఆల్బమ్ క్రియేట్ చేశారు. ఆ ఆల్బమ్ కవర్‌ ఫొటోలో స్టిల్ ఇవ్వాలని బియాంక అలా చేశారని అక్కడున్న వారు అనుకుంటున్నారు. వారి వింత ప్రవర్తనకు ఈవెంట్ డిస్ట్రబ్ అవుతుందని ఈవెంట్ ఆర్గనైజేషన్ టీం వారిని అక్కడి నుంచి పంపించారు.

Also Read: ANUJA: ఓటీటీలో ఆస్కార్ నామినేటెడ్ షార్ట్ ఫిల్మ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు