/rtv/media/media_files/2025/02/03/JDezQ4oK7xCm1U3dFYDn.jpg)
allu Aravind
Allu Aravind: అల్లు అరవింద్ సమర్పణలో అక్కినేని నాగచైతన్య- సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ 'తండేల్'. ఫిబ్రవరి 7న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో.. తాజాగా మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్టులుగా అల్లు అర్జున్, సందీప్ రెడ్డి వంగా రాబోతున్నట్లు అనౌన్స్ చేయగా.. అల్లు అర్జున్ హాజరు కాలేదు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో దీనిపై అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ స్పందించారు. బన్నీ ప్రీ రిలీజ్ కి రాకపోవడానికి గల కారణాన్ని తెలియజేశారు.
Also Read: Vijay Sethupathi: తమిళంలో పాన్ కార్డు మార్చాలి.. స్టార్ హీరో రిక్వెస్ట్ .. ఎందుకిలా?
అల్లు అర్జున్ కి గ్యాస్ నొప్పి..
అల్లు అర్జున్ తీవ్రమైన గ్యాస్ సమస్య కారణంగా కార్యక్రమానికి హాజరు కాలేకపోయారని వివరణ ఇచ్చారు. ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ ఆరోగ్యానికి సంబంధించి మరో వార్త కూడా వైరల్ అవుతుంది. ఆయన కాలుజారి కిందపడడంతో కాలు బెనికిందని.. అందుకే ఈవెంట్ కి రాలేదని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.
#AlluArjun couldn't attend the event due to severe gastritis "
— ᴅᴀʀʀᴇɴ ʜᴏʟᴍᴇs🕸️🐕 (@BottleCot93883) February 2, 2025
- Allu Aravind #Thandel #SandeepReddyVanga pic.twitter.com/Mj1wA89Cwp
శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో మత్స్యకారుల నిజజీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని చందూ మొండేటి తెరకెక్కించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై దాదాపు రూ. 72 కోట్ల బడ్జెట్ తో బన్నీ వాసు నిర్మించారు. నాగ చైతన్య కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన తొలి చిత్రమిది. ఇందులో నాగచైతన్య తండేల్ రాజు పాత్ర పోషించగా.. సాయి పల్లవి బుజ్జితల్లి రోల్లో కనిపించనుంది.
Also Read: స్వలింగ వివాహాలకు అధికారిక గుర్తింపు ...ఆగ్నేసియాలో మొదటి దేశంగా థాయిలాండ్!