/rtv/media/media_files/2025/08/03/money-plant-2025-08-03-10-48-41.jpg)
Money Plant
ఇంట్లో డబ్బు వృద్ధి చెందాలని ఎన్నో పూజలు చేయడం, నియమాలు పాటించడం వంటివి చేస్తుంటారు. చాలా మంది ఇంట్లో మనీ ప్లాంట్‌ను ఉంచుతారు. దీనివల్ల ఇంట్లో కుప్పలు కుప్పలుగా డబ్బు పుట్టుకొస్తుందని అంటున్నారు. అయితే ప్రతీ విషయంలో కొన్ని వాస్తు నియమాలు ఉన్నట్లు మనీ ప్లాంట్ విషయంలో కూడా ఉన్నాయి. కానీ చాలా మంది ఈ వాస్తు నియమాలను అసలు పాటించడం లేదు. దీనివల్ల మనీ ప్లాంట్‌ను ఇంట్లో ఉంచడం వల్ల ఎలాంటి ప్రతిఫలం ఉండదని పండితులు అంటున్నారు. మరి ఈ మనీ ప్లాంట్‌ను ఏ దిశలో ఉంచితే ఇంట్లో డబ్బు వృద్ధి చెందుతుందో చూద్దాం.
ఇది కూడా చూడండి: Sravana Masam 2025: ఈ నియమాలు శ్రావణ మాసంలో పాటిస్తే.. దరిద్రం పోయి.. సకల సంతోషాలు కలుగుతాయట!
ఆగ్నేయ దిశలో..
మనీ ప్లాంట్‌ను ఇంట్లో ఈశాన్య దిశలో అసలు ఉంచకూడదని పండితులు అంటున్నారు. ఈ దిశలో ఉంచడం వల్ల ప్రతీ విషయంలో ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఏ పని తలపెట్టినా సరిగ్గా జరగదు. అన్నింట్లో ఆటంకాలు ఏర్పడతాయి. ఇంట్లో ఉన్న డబ్బు కూడా తొలగిపోతుంది. ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయని పండితులు అంటున్నారు. అయితే మనీ ప్లాంట్‌ను ఇంట్లో తూర్పు ఆగ్నేయ దిశలో ఉంచడం వల్ల మంచి జరుగుతుంది. ఇంట్లో అసలు డబ్బుకు కొరత ఉండదు. ఇప్పటి వరకు ఉన్న అప్పులు అన్ని కూడా తీరిపోయి.. డబ్బు వృద్ధి చెందుతుంది. ప్రతీ విషయంలో అనుకూల ఫలితాలు ఉంటాయి.
ఇంటి బయట కాదు..
చాలా మంది మనీ ప్లాంట్‌ను ఇంటి బయట పెంచుతుంటారు. కానీ దీన్ని ఇంట్లోనే పెంచాలని పండితులు చెబుతున్నారు. దీనివల్ల ఇంట్లో డబ్బు వృద్ధి చెందుతుందని పండితులు అంటున్నారు. కొందరు తీగను పైకి కాకుండా తీసేస్తారు. ఇలా మనీ ప్లాంట్ తీగలను అసలు కిందకు వేలాడదీయకూడదు. దీనివల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయని పండితులు అంటున్నారు. మనీ ప్లాంట్‌ను మట్టి లేదా నీటిలో పెరిగేలా ఇంట్లో పెరగడం వల్ల పాజిటివ్ శక్తి వస్తుందని పండితులు చెబుతున్నారు.
ఈ ప్లేస్‌లో అసలు పెట్టకూడదు
కొందరు ఇంట్లో ప్లేస్ లేదని బాత్రూమ్‌లో పెడుతుంటారు. దీనివల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుందని పండితులు అంటున్నారు. ఇంట్లోని వ్యక్తులకు అనారోగ్యం రావడం, ఆర్థిక సమస్యలు రావడం వంటివి వస్తాయని చెబుతున్నారు. అలాగే ఏ పని తలపెట్టినా జరగదు. అన్ని విధాలుగా సమస్యలు వస్తాయని అంటున్నారు. కొందరు మనీ ప్లాంట్ నీటిని అసలు మార్చకుండా ఉంచుతారు. ఇలా కాకుండా అప్పుడప్పుడు వాటర్‌ను మారుస్తుండాలి. దీనివల్ల ఇంట్లో కొత్త కొత్త మార్పులు చోటుచేసుకుంటాయి. అలాగే ఏ పని తలపెట్టినా కూడా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: Transgender: ట్రాన్స్‌జెండర్ నుంచి డబ్బులు తీసుకుంటే మీకు మంచిదా? అసలు మ్యాటర్ ఇదే!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.