Animals Tips: పెంపుడు జంతువులకు స్నానం చేయించే సులభమైన చిట్కాలు మీకోసం

పెంపుడు జంతువులకు ఎప్పుడూ పూర్తిగా స్నానం చేయించాలి. మనుషులు వాడే షాంపూలకు బదులుగా.. కేవలం పెంపుడు జంతువుల కోసం తయారు చేసిన షాంపూలను మాత్రమే వాడాలి. స్నానం చేయించిన తర్వాత వాటి చర్మాన్ని, బొచ్చును పూర్తిగా ఆరబెట్టాని వైద్యులు చెబుతున్నారు.

New Update
home dog

Animals Tips

చాలామంది పెంపుడు జంతువులను తమ కుటుంబ సభ్యులుగా భావించి.. వాటితో సంతోషంగా గడుపుతారు. అయితే కొన్నిసార్లు పెంపుడు జంతువుల వల్ల ఇంట్లో ఒక రకమైన లేదా దుర్వాసన వస్తూ ఉంటుంది. ఇంట్లో ఎంత శుభ్రం చేసినా.. ఈ వాసన వదలకుండా ఉంటుంది. అందుకే పెంపుడు జంతువులను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి, ఇంట్లో దుర్వాసన రాకుండా చూసుకోవడానికి ఉపయోగపడే కొన్ని సులభ చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. పెంపుడు జంతువుల వల్ల ఇల్లు దుర్వాసన రాకుంట ఏం చేయాలో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. 

జంతువుల వల్ల ఇంట్లో దుర్వాసన వస్తుందా..? 

పెంపుడు జంతువులకు ఎప్పుడూ పూర్తిగా స్నానం చేయించాలి. మనుషులు వాడే షాంపూలకు బదులుగా.. కేవలం పెంపుడు జంతువుల కోసం తయారు చేసిన షాంపూలను మాత్రమే వాడాలి. స్నానం చేయించిన తర్వాత వాటి చర్మాన్ని, బొచ్చును పూర్తిగా ఆరబెట్టాలి. వీలైతే స్నానం తర్వాత పెంపుడు జంతువును కొంతసేపు ఎండలో ఉంచాలి. ఇది తేమను తొలగించి.. వాసన రాకుండా చేస్తుంది. అంతేకాకుండా పెంపుడు జంతువులతోపాటు వాటి పరుపులు (Bedding) బొమ్మలను శుభ్రం చేయడం కూడా చాలా ముఖ్యం. పెంపుడు జంతువు పడుకునే పరుపులను వారానికి కనీసం రెండుసార్లు ఉతకాలి. అలాగే రబ్బరు బొమ్మలను కూడా క్రమం తప్పకుండా కడగాలి. వాటి పంజరాలు, అవి ఎక్కువ సమయం గడిపే ప్రాంతాలను పూర్తిగా శుభ్రం చేసి ఎండలో ఆరబెట్టాలి.

ఇది కూడా చదవండి: దీపావళి వేడుకలు.. ఆరోగ్యానికి ప్రమాదం లేకుండా ఈ వస్తువులు కిచెన్ నుంచి తరిమేయండి!!

పెంపుడు జంతువుల పాదాలను శుభ్రం చేయడం కూడా చాలా అవసరం. పాదాలపై ఉండే మట్టి, ధూళి కూడా దుర్వాసనకు కారణమవుతుంది. దీనికోసం పెంపుడు జంతువులకు సురక్షితమైన క్లీనర్లను ఉపయోగించవచ్చు. అప్పుడప్పుడు ఏదైనా ఇన్‌ఫెక్షన్ కారణంగా, ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం వల్ల కూడా పెంపుడు జంతువుల నుంచి దుర్వాసన రావచ్చు. కాబట్టి ఆహారం సరిగా అరగనట్లయితే.. పశువైద్యుడిని సంప్రదించి వాటి ఆహారంలో తగిన మార్పులు చేయాలని వైద్యులు చెబుతున్నారు. ఈ సులభమైన పద్ధతులు పాటించడం ద్వారా పెంపుడు జంతువులను పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు, ఇంట్లో దుర్వాసన సమస్యను చాలావరకు తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. 

ఇది కూడా చదవండి: అశ్వ గంధ సాగు ఇంత లాభదాయకమా.. అదేంటో మీరు తెలుసుకోండి!!

Advertisment
తాజా కథనాలు