Pink Custard apple: పింక్ సీతాఫల్.. ఒక్కటి తింటే వందకు పైగా ఆరోగ్య ప్రయోజనాలు

పింక్ సీతాఫలంలో ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్, గుండె పోటు వంటి సమస్యలు రాకుండా కాపాడతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే జీర్ణ సమస్యలు, మలబద్ధకం, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో పింక్ సీతాఫలం ముఖ్య పాత్ర వహిస్తుందట.

New Update
Pink Custard apple

సాధారణంగా సీతాఫలం పచ్చని రంగులో ఉంటుంది. అయితే గుజరాత్‌లోని గదడాలో సంథియాలా గ్రామానికి చెందిన రైతు భరత్‌ భాయ్‌ పటేల్‌ పింక్ సీతాఫల్‌ను పండించాడు. అయితే పచ్చ రంగుతో పోలిస్తే.. పింక్ కలర్ సీతాఫలం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో చూద్దాం.

ఇది కూడా చూడండి: Mosquito Drone: అమెరికాకు ఇక చుక్కలే.. దోమ సైజులో చైనా డ్రోన్.. వీడియో చూస్తే షాక్ అవుతారు!

ఇందులోని పోషకాలు..

పింక్ సీతాఫలంలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు విటమిన్ సి, విటమిన్ ఎ, పొటాషియం, ఫైబర్ వంటివి ఉన్నాయి. ఇవి జీర్ణ సమస్యలను తగ్గించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయని నిపుణుణులు చెబుతున్నారు. ఇందులోని విటమిన్ సి ఇన్ఫెక్షన్లు, చర్మ సమస్యలను కూడా తగ్గిస్తుందని అంటున్నారు. సీతాఫలంలోని ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. 

సీతాఫలంలో పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇవి రక్తపోటును నియంత్రించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. సీతాఫలంలో ఉండే విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు యవ్వనంగా ఉండేలా చేస్తాయని నిపుణులు అంటున్నారు. అలాగే సీతాఫలం తినడం వల్ల క్యాన్సర్ కణాల పెరుగుదలను కూడా నిరోధించవచ్చని చెబుతున్నారు. అయితే మధుమేహం ఉన్నవారు మాత్రం ఈ పింక్ సీతాఫల్‌ను తక్కువగా తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చూడండి: Bike Stunts: HYDలో ఒకే బైక్‌పై 8 మంది యువకుల స్టంట్.. పోలీసులకు దొరకడంతో.. (వీడియో)

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

 

Advertisment
Advertisment
తాజా కథనాలు