/rtv/media/media_files/2025/01/14/CG0CIf9Do5DokhCgsxAY.jpg)
Parijata potion Photograph
Parijata Potion: పారిజాత పువ్వులు చాలా అందంగా ఉంటాయి. ఆయుర్వేదంలో ఈ మొక్క ఆకులను ఎక్కువగా వాడుతారు. పూలు, బెరడు కూడా ఔషధంగా ఉపయోగపడతాయి. పారిజాత ఆకులతో చేసిన కషాయం జలుబు, దగ్గుకు ఔషధంగా పనిచేస్తుంది. అలెర్జీల నుండి ఉపశమనం కలిగిస్తుంది. జ్వరం, కీళ్ల నొప్పులు, చర్మ వ్యాధులు, నిద్రలేమి వంటి వ్యాధులలో పారిజాత ప్రయోజనకరంగా ఉంటుదని నిపుణులు చెబుతున్నారు. ఈ కషాయంతో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఈ ఆర్టికల్లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పారిజాత కషాయం:
పారిజాత ఆకులతో చేసిన టీ కూడా రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. చలికాలంలో జలుబు చేస్తే చింతించాల్సిన పనిలేదు పారిజాత ఆకులతో చేసిన కషాయాన్ని తాగితే చాలంటున్నారు ఆయుర్వేద నిపుణులు. పారిజాత కషాయం తాగడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని, శరీరానికి వేడిని కూడా ఇస్తుందని వైద్యులు అంటున్నారు. పారిజాత ఆకులను వేడి నీటిలో 10 నుంచి 15 నిమిషాలు ఉడకబెట్టాలి, ఆపై మిరియాలు, కొద్దిగా ఉప్పు వేయాలి. జలుబుతో బాధపడేవారు ఈ వేడి కషాయాన్ని తాగాలి. ఇది చాలా ఉపశమనాన్ని ఇస్తుంది.
ఇది కూడా చదవండి: చలికాలం కదా అని గోరు వెచ్చని నీళ్ళు తాగుతున్నారా..ఈ విషయాలు తెలుసుకోండి
ఆస్తమా, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న రోగులకు పారిజాతం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పొడి దగ్గు నుండి ఉపశమనం పొందడానికి పువ్వులు, ఆకులతో తయారు చేసిన టీని తీసుకోవడం మంచిది. ఇది ఆస్తమా లక్షణాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. కావాలంటే ఈ టీలో టీ స్పూన్ తేనె కలుపుకుని తాగవచ్చు. పారిజాతం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇ.కోలి వంటి క్రిములతో పోరాడే సామర్థ్యం దీనికి ఉంది. పువ్వులు, ఆకులను తీసుకోవడం ద్వారా జ్వరం నుండి ఉపశమనం పొందడమే కాకుండా చర్మ అలెర్జీలు లేదా చర్మ సమస్యలను కూడా నయం చేయవచ్చు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.