సీజన్‌తో సంబంధం లేకుండా ఇంట్లో దోమలు ఉంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో అయితే చెప్పక్కర్లేదు. దోమలు ఇంట్లో ఉంటే డెంగీ, మలేరియా వంటి వైరల్ ఫీవర్లు ఎక్కువగా వస్తాయి. దోమలు ఎక్కువగా చెత్త, నీరు నిల్వ ఉండటం, మురికి కాలవలు వంటి వాటిలో వృద్ధి చెందుతాయి. దోమలు కుట్టడం వల్ల విపరీతమైన జ్వరం, అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇవి రాకుండా ఉండాలంటే ఇంట్లో దోమలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇది కూడా చూడండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి
రసాయనాలతో తయారు చేసిన వాటితో..
దోమలు బెడద నుంచి తప్పించుకోవాలని కొందరు మార్కెట్లో దొరికే వాటిని వాడుతారు. వీటివల్ల దోమలు తగ్గుతాయో లేదో తెలీదు. కానీ అనారోగ్య సమస్యలు మాత్రం వస్తాయి. ఎందుకంటే వీటిని రసాయనాలతో కలిపి తయారు చేస్తారు. వీటి నుంచి వచ్చిన గాలిని పీల్చడం వల్ల అనారోగ్య సమస్యలు తప్పకుండా వస్తాయి. అయితే ఇలాంటి పద్ధతులు కాకుండా సహజ చిట్కాలు పాటిస్తే ఇంట్లోకి దోమలు రావు.
ఇది కూడా చూడండి: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. రేపు ఈ ప్రాంతాల్లో నీళ్లు బంద్
అరటి పండు తిన్న తర్వాత ఆ తొక్కను పడేయకుండా ఇలా దోమల బెడద నుంచి తప్పించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. రోజులో ఏ సమయంలో అయిన కూడా గదిలోని నాలుగు మూలలో అరటి పండు తొక్కలను ఉంచాలి. వీటి నుంచి వచ్చే వాసనకు దోమలు అసలు ఆ దరిదాపుల్లో కూడా ఉండవు. మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వాడటం కంటే ఇలా సహజంగా అరటి తొక్కలతో చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవు. అలాగే ఈ అరటి తొక్కలను పేస్ట్ చేసి గది అంతా స్ప్రే చేసిన కూడా ఈ దోమల బెడద తగ్గుతుంది.
ఇది కూడా చూడండి: దారుణం.. టీచర్లు బ్లాక్ మెయిల్ చేస్తూ నీట్ విద్యార్థిపై..
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.
ఇది కూడా చూడండి: రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు