Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ తప్పులు అస్సలు చేయకండి.. ప్రాణాలకే ప్రమాదం..!

వర్షాకాలంలో అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వేడి, తాజాగా వండిన ఆహారాన్ని తినాలి. కాచి చల్లార్చిన నీటిని తాగాలి. పండ్లు, కూరగాయలను శుభ్రంగా కడగాలి. దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి. పొడి దుస్తులనే వేసుకోవాలి.

New Update
Monsoon Health Tips

Monsoon Health Tips

వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సీజన్‌లో ఎక్కువగా అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుంది. మురికి నీరు, చల్లటి పదార్థాలు తినడం, తడి దుస్తులతో తిరగడం, ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఆహారాలు తీసుకోవడం.. ఇలా చేయడం వల్ల చాలా మంది అనారోగ్యం సమస్యలకు గురవుతుంటారు. అయితే అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే కొన్నింటికి దూరంగా ఉండటం చాలా ముఖ్యం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

Also Read : పవిత్రమైన శ్రావణ మాసం.. ఈ పనులు చేశారో దరిద్ర దేవత మీ నెత్తిమీదే!

ఆహారాలపై మూత పెట్టాలి:

వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఇది బ్యాక్టీరియా, వైరస్‌లు త్వరగా వ్యాప్తి చెందడానికి అనుకూలంగా ఉంటుంది. అదే సమయంలో ఆహారాలు, పానీయాల మీద మూత పెట్టకుండా ఉంటే మాత్రం చాలా డేంజర్‌లో పడట్టే. ఎందుకంటే ఇలా చేయడం వల్ల వాటిపై సూక్ష్మక్రిములు చేరి అనారోగ్యాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా ఈ సీజన్‌లో రోడ్ల వద్ద కొనే ఆహారం, కట్ చేసిన పండ్లు, జ్యూస్‌లకు మరింత దూరంగా ఉండాలి. 

Also Read : ఖాళీ కడుపుతో మద్యం తాగడం మంచిదేనా? అందరూ చేసే తప్పే ఇది!

బాగా ఉడికించి వేడిగా తినాలి:

ఈ సీజన్‌లో పచ్చి కూరగాయలు, ఆకుకూరలు, సరిగా ఉడకని మాంసం వంటివి అనారోగ్యానికి కారణం అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆహారాన్ని బాగా ఉడికించి.. వేడిగా ఉన్నప్పుడే తినాలి.

చల్లని పదార్థాలకు దూరంగా ఉండాలి:

ఐస్ క్రీమ్, కోల్డ్ డ్రింక్స్ వంటి చల్లటి పదార్థాలు గొంతు నొప్పి, జలుబు, దగ్గు వంటి సమస్యలను పెంచుతాయి. అందువల్ల ఈ వర్షాకాలంలో వీటికి దూరంగా ఉండటం చాలా మంచిది. ఈ సీజన్‌లో శరీరాన్ని వెచ్చగా ఉంచుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

కలుషితమైన నీటికి దూరం:

వర్షాకాలంలో నీటి కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్‌లో కలుషితమైన నీటికి దూరంంగా ఉండాలి. కుళాయి నీరు, వర్షపు నీరు లేదా అపరిశుభ్రమైన ప్రాంతం నుండి వచ్చే నీటిని తాగకుండా ఉండాలి. కేవలం నీటిని వేడిచేసి.. అవి చల్లారిన తర్వాత తాగడం ఉత్తమం. 

Also Read : తిరుపతిలో కన్ను తెరిచిన శివయ్య.. గతంలో ఇలాంటి ఘటనలు ఎక్కడెక్కడ జరిగాయో తెలుసా?

తడి దుస్తులు వేసుకోకూడదు :

వర్షంలో తడిసినప్పుడు లేదా చెమట పట్టినప్పుడు తేమగా ఉండే దుస్తులను ఎక్కువసేపు ధరించకూడదు. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్లు, చర్మ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. వీలైనంత త్వరగా పొడి దుస్తులు ధరించాలి.

వ్యక్తిగత పరిశుభ్రత:

వర్షాకాలంలో క్రిములు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యం. తరచుగా చేతులు కడుక్కోకపోవడం, అపరిశుభ్రమైన చేతులతో ఆహారం తినడం వంటివి అనారోగ్యాన్ని తెచ్చిపెడతాయి. 

దోమల బెడద తగ్గించాలి:

వర్షం కారణంగా నీరు నిల్వ ఉండటం దోమలు వృద్ధి చెందడానికి అనుకూలంగా ఉంటుంది. దోమలు డెంగ్యూ, మలేరియా, చికెన్‌గున్యా వంటి వ్యాధులను వ్యాప్తి చేస్తాయి. అందువల్ల దోమలు ఉన్న ప్రదేశాలకు దూరంగా ఉండాలి. దోమతెరలు, దోమల నివారణ మందులు వాడాలి. 

Also Read : ఏపీలో విషాదం.. ప్రియుడి ఇంటిముందు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ప్రియురాలు

వ్యాయామం చేయాలి:

వ్యాయామం శరీరాన్ని చురుకుగా ఉంచి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వర్షాకాలంలో బద్ధకంగా ఉండి వ్యాయామం చేయకపోవడం రోగనిరోధక శక్తి తగ్గడానికి దారితీయవచ్చు.

ముఖ్యమైన చిట్కాలు:

వేడి, తాజాగా వండిన ఆహారాన్ని తినండి.

కాచి చల్లార్చిన నీటిని తాగాలి.

పండ్లు, కూరగాయలను శుభ్రంగా కడగండి.

వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి.

దోమల నివారణకు చర్యలు తీసుకోండి.

ఇంటిని శుభ్రంగా, పొడిగా ఉంచుకోండి.

రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోండి.

ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా వర్షాకాలంలో అనారోగ్యం బారిన పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.

Advertisment
తాజా కథనాలు