Mouthwash: పుదీనా మౌత్‌వాష్ క్యాన్సర్‌కు కారణం అవుతుందా? మౌత్‌వాష్‌లోని ఈ రసాయనం నోటిలోని బ్యాక్టీరియాను చంపడంలో సహాయపడుతుంది. లిస్టరిన్ మౌత్ వాష్‌లో ఉండే రసాయనాల వల్ల నోటి క్యాన్సర్, తల, మెడ క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 11 Nov 2024 in లైఫ్ స్టైల్ Short News New Update Mint mouthwash షేర్ చేయండి Mint Mouthwash: రోజువారీ మౌత్ వాష్ కోసం లిస్టరిన్ కూల్ మింట్ ఉపయోగిస్తే జాగ్రత్తగా ఉండాలని వైద్యులు అంటున్నారు. లిస్టరిన్ మౌత్ వాష్‌తో క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే లిస్టరిన్ తయారీ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్‌పై కేసు కూడా నమోదైంది. లిస్టరిన్ మౌత్ వాష్ స్ట్రెప్టోకోకస్ ఆంజినోసస్, ఫ్యూసోబాక్టీరియం న్యూక్లియేటం వంటి కొన్ని బ్యాక్టీరియాల పెరుగుదలను ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే బెంజల్కోనియం క్లోరైడ్ అనే రసాయనం క్యాన్సర్‌కు కారణమవుతుందని అంటున్నారు. క్యాన్సర్ వచ్చే ప్రమాదం.. మౌత్‌వాష్‌లోని ఈ రసాయనం నోటిలోని బ్యాక్టీరియాను చంపడంలో సహాయపడుతుంది. లిస్టరిన్ మౌత్ వాష్ గురించి, ఇందులో ఉండే రసాయనాల వల్ల నోటి క్యాన్సర్, తల, మెడ క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. అంతే కాకుండా మ్ము క్యాన్సర్‌కు కారణమవుతుందంటున్నారు. ప్యాంక్రియాస్ క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్, జీర్ణశయాంతర క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఆసియాలోనే అత్యంత ధనిక గ్రామం ఫ్యూసోబాక్టీరియా నోటి ద్వారా వచ్చే బ్యాక్టీరియా. లిస్టరిన్ మౌత్‌వాష్‌ను రోజుకు రెండుసార్లు ఉపయోగించేవారి నోటి కుహరంలో ఫ్యూసోబాక్టీరియం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. లిస్టరిన్, క్యాన్సర్ మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని చూపించే వాస్తవం లేనందున భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్ జాఘియాన్ చెప్పారు. కాకపోతే లిస్టరిన్ మౌత్ వాష్ వాడేవారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: సీఎం ఇలాఖాలో ఉద్రిక్తత.. తిరగబడ్డ జనం.. ఏకంగా కలెక్టర్ నే పరిగెత్తించి! గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చదవండి: వాయుకాలుష్యం నుంచి కళ్లను ఇలా కాపాడుకోండి ఇది కూడా చదవండి: అమ్మాయి ధైర్యానికి సలామ్.. నాలుగు పులులతో ఏం చేసిందో చూడండి #Mouthwash Side Effects #cancer #Mouthwash Danger #mouthwash మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి