Viral: అమ్మాయి ధైర్యానికి సలామ్.. నాలుగు పులులతో ఏం చేసిందో చూడండి ఓ అమ్మాయి ఏకంగా నాలుగు పులులతో కలిసి నిద్రిస్తున్న వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పులిపిల్లలపై ఆమె కేరింగ్‌ను పలువురు ప్రశంసిస్తుండగా మరికొందరు అడవి జంతువులతో సన్నిహిత సంబంధాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. By Vijaya Nimma 10 Nov 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update Viral Video షేర్ చేయండి Viral Video: అందరికీ యమదొంగ సినిమాలో డైలాగ్ గుర్తుండే ఉంటుంది. పులిని దూరం నుంచి చూడాలి అనిపించింది అనుకో చూస్కో.. పులితో ఫొటో దిగాలి అనిపించింది అనుకో కొంచెం రిస్క్ అయినా పర్లేదు ట్రై చేసుకోవచ్చు. సరే చనువు ఇచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తది అనే డైలాగ్ పాపులర్ అయింది. అలాగే పులులను మనం జూలో చూస్తుంటాం, వాటికి దగ్గరికి వెళ్లే ధైర్యం కూడా చేయం. అలాంటి ఓ అమ్మాయి ఏకంగా నాలుగు పులులతో కలిసి నిద్రిస్తున్న వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆమె కేరింగ్‌ను పలువురు ప్రశంసిస్తుండగా.. పులి పిల్లలను కౌగిలించుకుంటున్న అమ్మాయి వీడియో వైరల్‌గా మారింది. వీడియోలో యువతి తన చుట్టూ పెంపుడు జంతువుల్లా పులులతో ఆడుకుంటూ కనిపించింది. రెస్క్యూ చేసిన నాలుగు పులి పిల్లలను బ్రిటీష్ సంరక్షకురాలు ఫ్రెయా ఆస్పినాల్ మంచంపై కౌగిలించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఆన్‌లైన్‌లో చర్చనీయాంశమైంది. పులిపిల్లలపై ఆమె కేరింగ్‌ను పలువురు ప్రశంసిస్తుండగా మరికొందరు అడవి జంతువులతో సన్నిహిత సంబంధాలపై ఆందోళన వ్యక్తం చేశారు. View this post on Instagram A post shared by Freya Aspinall (@freyaaspinall) వీడియోలో ఆస్పినాల్ పులి పిల్లలతో ఆడుకుంటుంది. కొన్ని నెలల క్రితం కొన్ని పులి పిల్లలను రెస్క్యూ చేశామని, వాటి సంరక్షణ బాధ్యత తానే చూసుకుంటున్నానంటూ పోస్ట్‌లో ఆస్పినాల్ పేర్కొంది. కొన్ని రోజులు వాటిని సంరక్షించిన తర్వాత గతంలో సింహాలను వదిలినట్టే ఆఫ్రికాలోని అడవుల్లో ఈ పులి పిల్లలను వదిలేస్తానని చెప్పింది. అనేక మంది వీక్షకులు ఆస్పినాల్ అంకిత భావాన్ని ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఇది కూడా చదవండి: జపాన్ జింక సంస్కారానికి అందరూ ఫిదా #viarl మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి