Relationship Tips: పెళ్లంటే భయమా.. అయితే మీకు ఈ జబ్బు ఉన్నట్లే!

పెళ్లి పేరు వింటే కొందరు పానిక్ అటాక్‌కి గురి అవుతున్నట్లయితే వారికి గామోఫోబియా ఉన్నట్లేనని నిపుణులు అంటున్నారు. గతంలో ఎమోషనల్‌గా డిపెండ్ అయి బాధపడటం, విడాకులు, దంపతుల మధ్య గొడవలు వంటి వాటి వల్ల వీరికి ఈ ఫోబియా వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

New Update
Marriage

జనరేషన్ మారిపోవడంతో ఈ కాలం యువత పెళ్లి అంటే భయపడుతున్నారు. పెళ్లి చేసుకుని బాధపడటం కంటే సింగిల్‌గా హ్యాపీగా ఉండటం బెటర్‌ అని భావిస్తున్నారు. కొందరు పెళ్లి పేరు వింటే భయపడుతున్నారు. ఎలాంటి భాగస్వామి వస్తారో? ఎలా ఉంటారో? అనే భయంతో ఎక్కువ మంది పెళ్లంటే భయపడుతున్నారు. అయితే పెళ్లంటే భయపడటం కూడా ఓ ఫోబియేనే. పెళ్లి పేరు విన్న వెంటనే ఎవరైతే భయపడతారో వారికి గామోఫోబియా ఉన్నట్లేనని నిపుణులు అంటున్నారు. అసలు ఈ ఫోబియో ఎందుకు వస్తుందో చూద్దాం.

ఇది కూడా చూడండి: BIG BREAKING: అణు బాంబు వేస్తామని పాక్ బెదిరిస్తే సహించం.. మోదీ స్ట్రాంగ్ వార్నింగ్

ఎమోషనల్ డిపెండ్

గతంలో ఎమోషనల్‌గా ఇతరులపై డిపెండ్ కావడం వల్ల ఈ గామోఫోబియా వస్తుందని నిపుణులు అంటున్నారు. మళ్లీ ఎమోషనల్‌గా డిపెండ్ అయి బాధపడకూడదని భావించి చాలా మంది పెళ్లంటే భయపడతారు. ఆ పేరు విన్నా కూడా పానిక్ అటాక్ అవుతారు. ఒక్కసారిగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోతారు.

ఇది కూడా చూడండి: IPL ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్ రిలీజ్ చేసిన BCCI

విడాకులు తీసుకున్న వారిని చూసి

విడాకులు తీసుకున్న వారిని, గొడవలు పడుతున్న దంపతులను చూసి కొందరికి పెళ్లంటే భయం వేస్తుంది. పెళ్లి చేసుకుని ఇలా గొడవలు పడే బదులు ఒంటరిగా జీవితాంతం హ్యాపీగా ఉండటం బెటర్ అని భావిస్తారు. ఈ క్రమంలోనే పెళ్లికి దూరంగా ఉంటారు. 

ఇది కూడా చూడండి: పాకిస్థాన్‌ కిరానా హిల్స్‌లో రహస్యం.. ఆర్మీ చేతికి చిక్కిన సమాచారం..!

ఫ్రీడమ్ లేకపోవడం

పెళ్లయితే ఫ్రీడమ్ ఉండదని ఇతరులను చూసి కొందరికి పెళ్లంటే భయం వేస్తుంది. ఫ్రీడమ్ ఉండదు, అన్నింటికి సర్దుకోవడం, మానసికంగా సమస్యలు వీటిని చూసి పెళ్లికి భయపడతారు. అదే పెళ్లి చేసుకోకపోతే దేనికి సర్దుకోవాల్సిన అవసరం లేదని భావించి పెళ్లికి దూరంగా ఉంటారు. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. 

Advertisment