/rtv/media/media_files/2024/12/16/gBIChInYk9HeSf7iQQZE.jpg)
తబలా ఐకాన్ జాకీర్ హుస్సేన్ (73) అనారోగ్య సమస్యలతో డిసెంబర్ 16న కన్నుమూశారు. ఇడియోపతిక్ పల్మనరీ ఫ్రెబ్రోసిస్ అనే అరుదైన వ్యాధితో ఆయన చనిపోయారు. మార్చి 9, 1951న ముంబైలో జన్మించాడు. అతని తండ్రి అల్లాఖర కూడా తబలా వాయించేవాడు. రెండు వారాల క్రితం జాకీర్ హుస్సేన్ శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో ఆయన్ను ఐసీయూకి తరలించారు. జాకీర్ హుస్సేన్ ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ (IPF) అనేది దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నాడు.
Also Read: Maharashtra లో మంత్రివర్గ విస్తరణ.. 39 మంది MLAలు మంత్రులుగా ప్రమాణం
ఈ వ్యాధిలో అల్వియోలీ అని పిలువబడే ఊపిరితిత్తులలోని చిన్న గాలి సంచుల చుట్టూ ఉన్న కణజాలం వాపుకు గురవుతుంది. దీంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. జన్యు పరమైన మార్పులు, పర్యాపవరణ కాలుష్యం కారణంగా ఇడియోపతిక్ పల్మనరీ ఫ్రెబ్రోసిస్ వస్తోందని డాక్టర్లు నమ్ముతారు. ఈ వ్యాధి నిర్ధారణ కూడా చాలా కష్టం.
Also Read: వారానికి 70 గంటలు పనిచేయాల్సిందే.. మరోసారి బాంబు పేల్చిన నారాయణమూర్తి
ఇడియోపతిక్ పల్మనరీ ఫ్రెబ్రోసిస్ లక్షణాలు
శారీరక శ్రమ సమయంలో శ్వాస ఆడకపోవడం
కంటిన్యూగా పొడి దగ్గు
అలసట
బరువు తగ్గడం
వ్యాధి కారకాలు:
వీటి కారణంగానే ఇడియోపతిక్ పల్మనరీ ఫ్రెబ్రోసిస్ వస్తోందని చెప్పలేం కానీ.. సిగరెట్ తాగే వారికి ఆ వ్యాధి త్వరగా వస్తుందటని డాక్టర్లు చెప్తున్నారు. అంతే కాదు 60 ఏళ్లు పైబడిన వారిని ఈ వ్యాధి ఈజీగా అటాక్ చేస్తోంది. అలాగే కుటుంబంలో ఇది వరకే ఎవరికైనా ఆ వ్యాధి వచ్చి ఉండే వారు జాగ్రత్తగా ఉండాలి. ఇడియోపతిక్ పల్మనరీ ఫ్రెబ్రోసిస్ సోకిన 3 నుంచి 5 సంవత్సరాల్లో వ్యాధి తీవ్రతరమౌతుంది. అప్పుడే లక్షణాలు ఎక్కవైతాయి. కాలక్రమేణా, పల్మనరీ హైపర్‌టెన్షన్, శ్వాసకోశ వైఫల్యం వంటి సమస్యలకు ఇది దారితీస్తుంది. శరీరానికి ఆక్సిజన్ అందదు.
Also Read: గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 69 మంది మృతి
కంట్రోల్ చేయడానికి మార్గాలు
ఇడియోపతిక్ పల్మనరీ ఫ్రెబ్రోసిస్ కు నివారణ లేదు. వ్యాధి తీవ్రతను బట్టీ చికిత్స అందిస్తారు డాక్టర్లు. మెడిసిన్ వాడటం, ఆక్సిజన్ థెరపీ, ఊపిరితిత్తుల మార్పిడి, వ్యాయామం వంటివి ఈ వ్యాధిని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి.