కొందరు పిల్లలకు పోషకాలు ఉండే ఫుడ్ పెట్టకపోవడం వల్ల సన్నగా, నీరసంగా ఉంటారు. పిల్లలకు చిన్నప్పటి నుంచే పోషకాలు ఉండే ఫుడ్ పెట్టాలి. అప్పుడే వారు ఆరోగ్యంగా పెరుగుతారు. భవిష్యత్తులో ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఈ రోజుల్లో చాలా మంది పిల్లలకు బర్గర్లు, పిజ్జాలు, సమోసాలు అంటూ ఫాస్ట్‌ఫుడ్ పెడుతున్నారు. వీటిలో విటమిన్లు, కాల్షియం వంటి పోషకాలు లేకపోవడం వల్ల పిల్లలు సన్నగా ఉంటున్నారు. పిల్లలు ఆరోగ్యంగా ఉండి బరువు పెరగాలంటే తప్పకుండా ఈ పదార్థాలు వారి డైట్‌లో చేర్చాలి. ఇది కూడా చూడండి: నేడే "బిగ్ బాస్-8" లాస్ట్ డే.. 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు! పాలు తాగడం పిల్లలకు రెండు పూలు పాలు తాగించాలి. ఇందులోని కాల్షియం, విటమిన్ డి, ఫాస్పరస్ కండరాలు పెరగడంలో బాగా సహాయపడతాయి. వీటివల్ల ఎముకల బలంగా ఉండటంతో పాటు శారీరకంగా, మానసికంగా కూడా స్ట్రాంగ్‌గా ఉంటారు. వీటిలో డ్రైఫ్రూట్స్ పౌడర్ కూడా కలిపి పిల్లలకు పెట్టవచ్చు. ఇది కూడా చూడండి: YS Sharmila: మరోసారి తన అన్నపై రెచ్చిపోయిన షర్మిల డ్రై ఫ్రూట్స్ డ్రై ఫూట్స్ పిల్లల ఆరోగ్యానికి మెరుగుపడతాయి. ఇందులోని పోషకాలు పిల్లలను బలంగా తయారు చేస్తాయి. రోజూ ఉదయం పిల్లలకు వీటిని తినిపించడం వల్ల ఆరోగ్యంగా బరువు పెరుగుతారు. ముఖ్యంగా వాల్‌నట్స్, ఎండుద్రాక్ష, బాదం, జీడిపప్పు, మఖానా వంటివి పిల్లలకు పెట్టాలి. ఇది కూడా చూడండి: మరికాసేపట్లో గ్రూప్ - 2 పరీక్ష.. ఈ తప్పు చేశారో ఇంటికే ఇక! అరటిపండ్లు అరటిపండులో ఉండే విటమిన్ బి6, విటమిన్ సి, విటమిన్ ఎ, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ తక్షణమే శక్తిని ఇస్తారు. ఇందులోని పోషకాలు పిల్లలు బరువు పెరిగేలా చేస్తాయి. ఇది కూడా చూడండి: Road Accident: అమెరికాలో భారి యాక్సిడెంట్.. తెనాలి విద్యార్థిని మృతి! నెయ్యి నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. డైలీ పిల్లలకు డైట్‌లో నెయ్యి యాడ్ చేయడం వల్ల ఈజీగా బరువు పెరుగుతారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు పిల్లల మెదడు పనితీరును పెంచుతాయి. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.