పిల్లలు పుట్టలేదని కోడిపిల్లను మింగి.. ప్రాణం తీసిన మంత్రగాడి ఉపాయం..!

ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపుర్‌లో మూఢనమ్మకంతో ఓ వ్యక్తి బతికున్న కోడిపిల్లను మింగేశాడు. అది గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక చనిపోయాడు. 20 సెంటీమీటర్ల కోడిపిల్ల గొంతులో చిక్కుకు పోవడం వలన గాలి ఆడక ఆనంద్‌ అక్కడికక్కడే మరణించాడని డాక్టర్లు చెప్పారు.

New Update
sycho Medchal

Chhattisgarh

Chhattisgarh: మూఢనమ్మకాల గురించి ప్రస్తుత సమాజంలో అనేక ఘటనలు చూస్తూనే ఉన్నాము. అలాంటివి నమ్మొద్దని చెబుతున్నా... ఎంతోమంది వాటిని నమ్మి ప్రాణాలు పోగొట్టుకోవడమే కాకుండా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా మూఢనమ్మకాలతో ఓ వ్యక్తి ప్రాణాలు తీసుకున్నాడు. ఛత్తీస్‌గఢ్‌లోని చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది. తండ్రి కావాలన్న కోరికతో ఏకంగా బతికున్న కోడిపిల్లను మింగి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇది కూడా చదవండి: బాబూ పక్కకెళ్లి ఆడుకోమ్మా.. గజరాజు మర్యాద చూడండి

బతికి ఉన్న కోడి పిల్లను మింగేశాడు:

వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం అంబికాపురంలో ఆనంద్ యాదవ్ (35) అనే వ్యక్తి కుటుంబంతో నివసిస్తున్నాడు. గత కొంతకాలంగా వీరికి సంతానం కలగక పోవడంతో తాంత్రికుడిని ఆశ్రయించారు. తండ్రి కావాలన్న కోరికతో అతని చెప్పిన మాటలు విన్నాడు. అతను చెప్పినట్లుగా బతికి ఉన్న కోడి పిల్లను మింగేసాడు. అది గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరాడక ఆనంద్ యాదవ్ అనే వ్యక్తి అక్కడికక్కడే  కుప్ప కూలిపోయాడు. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

ఇది కూడా చదవండి: వామ్మో.. 9 నెలల గర్భంతో భరతనాట్యం

వైద్యులు పరీక్షించగా అప్పటికే ఆనంద్‌ మృతి చెందినట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం గొంతులో ఇరుక్కున్న కోడి పిల్లలను బయటకు తీశారు. అయితే కోడి పిల్ల బతికి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. 20 సెంటీమీటర్ల కోడిపిల్ల గొంతులో చిక్కుకు పోవడం వలన గాలి ఆడక ఆనంద్‌ అక్కడికక్కడే మరణించాడని డాక్టర్లు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: శీతాకాలంలో ఈ కూరగాయతో ఎంతో ఆరోగ్యం

ఇది కూడా చదవండి: ఎలుకల నిలయాలుగా గురుకులాలు.. విద్యార్థిని పరిస్థితి విషమం

Advertisment
తాజా కథనాలు