/rtv/media/media_files/2025/03/24/uyIFAIhUTHll2vU6q0rz.jpg)
Tea on Empty Stomach
Tea on Empty Stomach : టీ అనేది ఒక ప్రసిద్ధ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి పానీయం. బ్లాక్ టీ, గ్రీన్ టీ , హెర్బల్ టీ ఇలా అనేక రకాల టీలు ఉంటాయి. ఉదయం నిద్రలేవగానే అందరికీ ఒక మంచి టీ లేదా కాఫీతో డేను ప్రారంభించడం అలవాటు. అయితే కొంతమందికి ఖాళీ కడుపుతో టీ తాగిన తర్వాత కడుపు ఉబ్బరంగా, చికాకుగా, కడుపులో తిప్పినట్లుగా అనిపిస్తుంది. అసలు ఇలా ఎందుకు అవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా.? దీనికి కారణమేంటో ఇక్కడ తెలుసుకోండి.
Also Read: ఫ్యాన్స్ కు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన నాగ్..!
Also Read: సన్నటి కనుబొమ్మలతో ఇబ్బంది పడుతున్నారా..ఇలా చేస్తే మందంగా పెరుగుతాయి
టీ తాగిన తర్వాత కడుపు ఉబ్బరం ఎందుకు?
టీ, కాఫీలోని కెఫీన్ కంటెంట్ ఉంటుంది. ఇది కడుపులో ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల ఖాళీ కడుపుతో తాగినప్పుడు కడుపు ఉబ్బరంగా, చికాకుగా అనిపిస్తుంది. అయితే ఇలాంటి పరిస్థితిని నివారించడానికి టీలో చక్కెరకు బదులుగా తేనే లేదా స్టెవియా వంటి సహజ ఎంపికలు ఉత్తమంగా పనిచేస్తాయి. ఇలా చేయడం ద్వారా టీ సులభంగా జీర్ణమవుతుంది. అలాగే కడుపులో ఎలాంటి గ్యాస్ ఏర్పడదు. దీంతోపాటు టీని తయారు చేసేటప్పుడు యాలకులు వేయడం ద్వారా గ్యాస్ ఏర్పడదు. యాలకులు టీ రుచిని పెంచడమే కాకుండా జీర్ణక్రియకు తోడ్పడుతుంది. అలాగే కడుపులో ఆమ్లత్వాన్ని తగ్గిస్తుంది.
Also Read: డ్రాగన్ వచ్చేది అప్పుడే..! రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న NTR 31..
Also Read: అతిగా ఆలోచించడం వల్ల కలిగే సమస్యలు
life-style | latest-news | telugu-news | tea