Nagarjuna: ఫ్యాన్స్ కు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన నాగ్..!

చాలా కాలం తరువాత టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా ఓ సోలో మూవీ చేస్తున్నారన్న వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఓ యువ దర్శకుడు వినిపించిన కథ నచ్చడంతో ఓకే చెప్పేశాడట నాగ్. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని సమాచారం.

New Update
Nagarjuna

Nagarjuna

Nagarjuna: కింగ్ నాగార్జున సొలో సినిమాల స్పీడ్ తగ్గిందనే చెప్పాలి. నాగ్ నుండి  సోలో మూవీ వచ్చి చాలా కాలమే అయింది. 'నా సామిరంగ' తర్వాత నాగార్జున మరో సోలో సినిమా చేయలేదు. అయితే ప్రస్తుతం నాగ్ లైన్ అప్ చూసుకుంటే అన్ని భారీ ప్రాజెక్టులే ఉన్నాయి. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో   ధనుష్‌తో కలిసి 'కుబేర' సినిమాలో, రజనీకాంత్‌తో కలిసి 'కూలీ' చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు కింగ్ నాగార్జున.

Also Read: సన్నటి కనుబొమ్మలతో ఇబ్బంది పడుతున్నారా..ఇలా చేస్తే మందంగా పెరుగుతాయి

సోలో హీరోగా గ్రీన్ సిగ్నల్..

ఇక సోలో హీరోగా నాగార్జున ఓ కొత్త ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఓ యువ దర్శకుడు వినిపించిన కథ ఆయనకు బాగా నచ్చడంతో వెంటనే ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పేశాడట. ప్రస్తుతం ఆ స్క్రిప్ట్ మీద ఇంకా కొన్ని చర్చలు జరుగుతున్నాయని, అన్నీ అనుకూలంగా జరిగితే ఈ కొత్త సినిమాని త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది.

Also Read: డ్రాగన్ వచ్చేది అప్పుడే..! రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న NTR 31..

ఈ సినిమాతో చాలా కాలం తరువాత పూర్తి సోలో హీరోగా నాగార్జున కనిపిస్తారని తెలియడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోయింది. అయితే ఫ్యాన్స్ ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Also Read: అతిగా ఆలోచించడం వల్ల కలిగే సమస్యలు

Also Read: “SSMB29” రిలీజ్ డేట్ పై హాట్ బజ్! ఆ సెంటిమెంట్‌ కలిసొస్తుందా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు