Fridge Water ఫ్రిడ్జ్ నీళ్లతో గుండెపోటు.. ఇది తెలిస్తే మళ్ళీ తాగరు.

ఫ్రిడ్జ్ వాటర్ ఎక్కువగా తాగడం గుండెపోటు ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. చల్లని నీరు నాడీ వ్యవస్థను చల్లబరిచి హార్ట్ రేట్ తగ్గిస్తాయి. ఈ పరిస్థితి గుండెపోటుకు దారి తీస్తుంది. అప్పుడప్పుడు తాగితే పర్వాలేదు ఎక్కువగా తాగడం మంచిది కాదు.

New Update
Fridge Water

Fridge Water Photograph: (Fridge Water)

Fridge Water వేసవి కాలం రాగానే అందరు చల్లటి నీరు తాగడానికి తహ తహలాడుతుంటారు. ఈ చల్లటి నీటి కోసం ఎక్కువ శాతం మంది ఫ్రిడ్జ్ లను ఉపయోగిస్తారు. అయితే ఫ్రిడ్జ్ నీళ్లను తాగడం ఆరోగ్యానికి పెద్ద ముప్పు అనే సంగతి తెలుసా. గుండె వచ్చే ప్రమాదం కూడా ఉంటుందట. ఏంటి! చల్లటి నీటితో గుండెపోటా అని ఆశ్చర్యపోతున్నారా. గుండెపోటు మాత్రమే కాదు అనేక ఇతర సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. చల్లటి నీళ్లు తాగడం వల్ల కలిగే నష్టాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.. 

గుండెపోటు

చల్లని  నీరు నాడీ వ్యవస్థను చల్లబరిచి హార్ట్ రేట్ తగ్గిస్తాయి.  ఈ పరిస్థితి గుండెపోటుకు దారి తీస్తుంది. ముఖ్యంగా తిన్న వెంటనే చల్ల నీరు తాగడ వల్ల  శరీరంలోని కొవ్వు అలాగే పేరుకుపోతుంది.  తద్వారా బరువు పెరిగే అవకాశం ఉంది. 

Also Read :  రిపీటైతే తీవ్ర చర్యలుంటాయ్.. రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు వార్నింగ్!

జీర్ణక్రియ సమస్యలు

అదేపనిగా  చల్లటి నీళ్లు తాగడం వల్ల జీవక్రియపై ప్రతీకూల ప్రభావం చూపుతుంది. అంతేకాదు రోగానిరోధక శక్తిని కూడా తగ్గిస్తుంది. చల్లని నీరు తాగడం మలబద్ధకం, గ్యాస్, కడుపు నొప్పి సమస్యలకు దారి తీస్తుంది. జీర్ణక్రియ కూడా మందగిస్తుంది. 

గొంతు ఇన్ఫెక్షన్ 
చల్లని  నీళ్లు చిగుళ్ల నొప్పిని కలిగిస్తాయి.  దీనివల్ల  దంతాలు వదులుగా మారే అవకాశం ఉంది. గొంతు ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. కూల్ వాటర్ ఎక్కువగా తాగడం వల్ల   తలనొప్పి, సైనస్ సమస్యలు  కూడా తలెత్తుతాయి. 

ఏ నీళ్లు తాగాలి.. 
 మట్టి కుండలోని నీళ్లు తాగితే మంచిది. కూల్ వాటర్ ఏ కాలంలో కూడా  ఆరోగ్యానికి మంచిది కాదు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

atest-news | telugu-news | life-style | health

Also Read  :  నువ్వు చామనచాయ రంగులో ఉన్నావ్.. కొడుకు తెల్లగా ఎలా పుట్టాడని భర్త వేధింపులు.. చివరికి

Advertisment
తాజా కథనాలు