/rtv/media/media_files/2025/10/22/kitchen-tips-2025-10-22-14-44-30.jpg)
Kitchen Tips
వంట చేస్తున్నప్పుడు పాలు, పప్పు వంటివి అడుగంటి.. పాత్రలు త్వరగా నల్లగా మాడిపోవడం ప్రతి ఇంట్లోనూ జరిగేదే. ఆ తర్వాత గంటల తరబడి వాటిని తోమడం ఒక పెద్ద సమస్య. అయితే.. ఇకపై మాడిపోయిన పాత్రలను శుభ్రం చేయడం అంత కష్టం కాదు. ఖరీదైన క్లీనర్‌లు లేకుండా.. ఎక్కువ శ్రమ పడకుండా.. తక్కువ ఖర్చుతో మాడిపోయిన పాత్రలను మెరిపించే కొన్ని సులభమైన చిట్కాలు ఉన్నాయి.
మాడిపోయిన పాత్రలు శుభ్రం చేయడానికి..
బేకింగ్ సోడా-నిమ్మకాయ మ్యాజిక్: మాడిపోయిన పాత్ర చల్లబడిన తర్వాత దానిపై కొద్దిగా బేకింగ్ సోడా చల్లి, సగం నిమ్మకాయను పిండాలి. కొద్ది నిమిషాల తర్వాత బుడగలు రావడం మొదలవుతుంది. అప్పుడు స్పాంజ్‌తో మెల్లగా రుద్దితే.. మరకలు తొలగిపోయి.. వాసన కూడా మాయమవుతుంది.
వెనిగర్- నీటి ట్రిక్: పాత్ర తీవ్రంగా మాడిపోయినట్లయితే.. కొద్దిగా నీరు, వెనిగర్ పోసి పొయ్యి మీద పెట్టి 5-10 నిమిషాలు ఉడకబెట్టండి. చల్లారిన తర్వాత బ్రష్‌తో రుద్దితే.. మాడిన పొర సులభంగా ఊడిపోతుంది.
ఉప్పు-నిమ్మకాయ: ఇంట్లో బేకింగ్ సోడా లేకపోతే నిమ్మకాయపై కొద్దిగా ఉప్పు రాసి దాన్ని పాత్రపై మాడిన ప్రదేశంలో రుద్దండి. ఈ తరతరాల చిట్కాతో మరకలు సులభంగా తొలగి పాత్ర మెరుస్తుంది.
ఇది కూడా చదవండి: తెల్లవారుజామున 5 గంటలకు నిద్ర లేచేందుకు చక్కటి చిట్కాలు!
డిష్ వాష్ జెల్-వేడి నీరు: స్టీల్ లేదా నాన్-స్టిక్ పాత్రలు మాడిపోతే.. వాటిలో వేడి నీరు, కొద్దిగా డిష్‌వాషింగ్ జెల్ పోసి 30 నిమిషాలు ఉంచండి. ఆ తర్వాత శుభ్రం చేస్తే ఎక్కువ రుద్దాల్సిన అవసరం లేకుండా మురికి పోతుంది.
అల్యూమినియం పాత్రలకు టొమాటో-వెనిగర్: అల్యూమినియం పాత్రలు నల్లగా మారినట్లయితే.. వాటికి టొమాటో రసం లేదా వెనిగర్ రాసి.. కొద్దిసేపటి తర్వాత పొడి గుడ్డతో తుడవండి. పాత్రలు కొత్తవాటిలా మెరుస్తాయి.
బూడిద: గ్రామాలలో ఇప్పటికీ కర్ర బూడిదను సబ్బుతో కలిపి ముద్దగా చేసి మాడిన ప్రాంతంలో రుద్దుతారు. దీనివల్ల కూడా పాత్రలు పాత మెరుపును సంతరించుకుంటాయి. శుభ్రం చేసిన తర్వాత.. నిమ్మరసం లేదా వెనిగర్‌తో తుడిస్తే ఎక్కువ మెరుపు వస్తుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చదవండి: పెంపుడు జంతువులకు స్నానం చేయించే సులభమైన చిట్కాలు మీకోసం