Amla Tree: కార్తీక మాసంలో ఆ చెట్టు కింద భోజనం చేస్తే..! కార్తీక మాసంలో శివ కేశవులతో సమానంగా ఉసిరి చెట్టు పూజలందుకుంటుంది. ఉసిరి చెట్టును మహావిష్ణువుగా కొలిచి, ఆ చెట్టు కింద భోజనం చేయడం ఈ నెలలో ఆనవాయితీగా వస్తుంది. అయితే ఉసిరి చెట్టు కింద భోజనం ఎందుకు చేయాలి అనే విషయాలు ఈ కథనంలో... By Bhavana 03 Nov 2024 in లైఫ్ స్టైల్ Short News New Update షేర్ చేయండి Life Style : శనివారం నుంచి కార్తీక మాసం మొదలైంది. ఈ నెలకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ నెల రోజుల పాటు హిందూవులంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో శివకేశవలను పూజిస్తూ ఉంటారు. నిత్యం శివ, విష్ణువును పూజిస్తూ భక్తిలో మునిగిపోతారు భక్తులు. అయితే ఈ కార్తీకమాసంలో ఉసిరి చెట్టును ఎంతో భక్తిగా పూజిస్తుంటారు. Also Read: జనవరి నుంచే కొత్త రేషన్ కార్డులు.. ఫస్ట్ ఇచ్చేది వారికే! ఉసిరి చెట్టును మహావిష్ణువుగా కొలిచి, ఆ చెట్టు కింద భోజనం చేయడం ఈ నెలలో ఆనవాయితీగా వస్తుంది. అయితే ఉసిరి చెట్టు కింద భోజనం చేయాలనే ఆనవాయితీ ఎందుకు వచ్చింది? ఉసిరి చెట్టును మహా విష్ణువుగా ఎందుకు కొలుస్తారు? ఇలా చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం... ఉసిరి చెట్టుకు ఎందుకంత ప్రాముఖ్యత అంటే? విష్ణు పురాణం ప్రకారం.. కార్తీకమాసంలో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీ దేవిలు కొలువై ఉంటారని చెబుతుంటారు. దేవుళ్ళు ఉన్న కాలంలో దేవతలు, రాక్షసుల మధ్య జరిగిన యుద్ధంలో అమృత బిందువులు భూమి మీద పడ్డాయని, అప్పుడే ఈ ఉసిరి చెట్టు పుట్టిందనే నమ్మకం. Also Read: బాల్ టాంపరింగ్ కు పాల్పడిన భారత కీపర్. అంపైర్ తో వాగ్వాదం! ఉసిరి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ ఉసిరి తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. ఇందులో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. Also Read: యూపీ సీఎంకు బెదిరింపులు.. సిద్ధిఖీలా నిన్ను చంపేస్తామంటూ.. అది రోగ నిరోధక శక్తిని పెంపొందించి, అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది. ఉసిరి చెట్టు గాలి కూడా ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఇలాంటి చెట్టును ధాత్రివృక్షమని కూడా పిలుస్తూ ఉంటారు. ఉసిరి ఆరోగ్యానికి సంజీవనిలాంటిది. అందుకే ఈ చెట్టుకు ఇంతటి ప్రాముఖ్యత ఏర్పడిందని పేర్కొంటున్నారు. Also Read: రేపే ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి.. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఉసిరి చెట్టు కింద ఎందుకు భోజనం చేయాలంటే ఉసిరి చెట్టు వేర్లలో శ్రీమహా విష్ణువు, కాండంలో శివుడు, చెట్టుపైన బ్రహ్మదేవుడు, చెట్టు కొమ్మల్లో సూర్యుడు, చిన్న చిన్న కొమ్మల్లో సకల దేవతలు ఉంటారని పండితులు చెబుతుంటారు. అలాంటి చెట్టుకు తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం దిక్కులలో పాటు ఈశాన్యం వంటి మూలల్లో సైతం ఎనిమిది దీపాలను వెలిగించి.. చెట్టు చుట్టూ ఎనిమిది ప్రదిక్షణలు చేసి, ఆ చెట్టు కింద భోజనం చేయాలి. ఇలా చేయడం అత్యంత శుభసూచకంగా భావిస్తుంటారు. అలాగే కార్తీక మసమాలో ఉసిరికాయపై ఒత్తులు పెట్టి దీపం వెలిగిస్తుంటారు. ఇలా దీపం పెట్టడం వల్ల శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనదని, ఇలా చేయడం వల్ల విష్ణు కటాక్షం కలుగుతుందని చెబుతుంటారు. ఉసిరి చెట్లు ఇంట్లో ఉంటే వాస్తు దోషాలు తొలిగి పోతాయట. అలాగే దుష్టశక్తులు కూడా ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయని పండితులు చెబుతుంటారు. అలాగే నరదృష్టి కూడా ఇంటికి తగలకుండా ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. #amla-benefits #karthika-masam #amla మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి