Chicken Prices: చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు

కార్తీక మాసం కావడంతో చికెన్ ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కేజీ చికెన్ ధర రూ.180 నుంచి 200 మధ్య ఉంది. అదే లైవ్ చికెన్ తీసుకుంటే కేజీ రూ.140 మాత్రమే ఉంది. రెండు వారాల కిందట కేజీ చికెన్ ధర రూ.300 ఉండేది.

New Update
Chicken rates: నాన్ వెజ్‌ ప్రియులకు గుడ్ న్యూస్‌..భారీగా తగ్గిన చికెన్‌ ధరలు!

చాలామందికి చికెన్ అంటే ప్రాణం. సమయం, సందర్భం, పగలు, రాత్రి తేడా లేకుండా కొందరు చికెన్ ఇష్టంగా తింటారు. ఇలాంటి వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చికెన్ ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కేజీ చికెన్ ధర రూ.180 నుంచి 200 మధ్య ఉంది.

ఇది కూడా చూడండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి

రెండు వారాలతో పోలిస్తే.. 

అదే లైవ్ చికెన్ తీసుకుంటే కేజీ కేవలం రూ.140 మాత్రమే ఉంది. రెండు వారాల కిందట కేజీ చికెన్ ధర రూ.300 ఉండేది. కానీ ఇప్పుడు రూ.100 కంటే ఎక్కువగా పడిపోయింది. అయితే చికెన్‌కి డిమాండ్ ఉన్న కొన్ని నగరాల్లో మాత్రం చికెన్ రెట్లు ఏ మాత్రం తగ్గకుండా అలానే ఉన్నాయి. 

ఇది కూడా చూడండి:  హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. రేపు ఈ ప్రాంతాల్లో నీళ్లు బంద్

సాధారణంగా హిందువులు పూజల సమయంలో నాన్‌వెజ్‌కి దూరంగా ఉంటారు. హిందువులు ఎంతో భక్తితో పూజలు నిర్వహించే కార్తీక మాసం కావడం వల్ల చికెన్ రేట్లు భారీగా తగ్గాయి. ఎక్కువ శాతం మంది కార్తీక మాసం నెల రోజుల పాటు అసలు చికెన్ తినరు. దీని ఎఫెక్ట్ చికెన్‌పై పడిందని నిపుణులు భావిస్తున్నారు. కార్తీక మాసమంతా ఇలానే చికెన్ రేట్లు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: దారుణం.. టీచర్లు బ్లాక్‌ మెయిల్ చేస్తూ నీట్ విద్యార్థిపై..

ఇలా చికెన్ రేట్లు తగ్గడం వల్ల పౌల్ట్రీ రైతులకు నష్టమనే చెప్పవచ్చు. ఎందుకంటే కోళ్లను అలా ఉంచడం వల్ల సేల్ కాకుండా ఉండిపోవడం వల్ల వారికి ఎలాంటి లాభం ఉండదు. దీనివల్ల రైతులు నష్టపోతారు. కోళ్లు పెరిగే కొలది వాటిని విక్రయించకపోతే కొన్నిసార్లు అవి మరణించే అవకాశం కూడా ఉంటుంది. దీనివల్ల రైతులకు భారీ నష్టం ఏర్పడుతుంది. 

ఇది కూడా చూడండి:  రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు