Chicken Prices: చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు
కార్తీక మాసం కావడంతో చికెన్ ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కేజీ చికెన్ ధర రూ.180 నుంచి 200 మధ్య ఉంది. అదే లైవ్ చికెన్ తీసుకుంటే కేజీ రూ.140 మాత్రమే ఉంది. రెండు వారాల కిందట కేజీ చికెన్ ధర రూ.300 ఉండేది.