Chicken Prices: బర్డ్ఫ్లూ ఎఫెక్ట్.. భారీగా పడిపోయిన చికెన్ ధరలు.. ఇప్పుడు కేజీ ఎంతంటే?
కోళ్లకు వైరస్ సోకుతుందనే అనే ప్రచారం బాగా జరగడంతో జనాలు చికెన్ తినేందుకు భయపడుతున్నారు. అంతకుముందు కళకళలాడిన చికెన్ సెంటర్లు ఇప్పుడు ఖాళీగా వెలవెలబోతున్నాయి. ఆదివారం కేజీ రూ.200-220 ఉన్న ధర ఇప్పుడు రూ.150-170 పలుకుతోంది.