/rtv/media/media_files/2025/01/11/CR76DrAWqneJs6cshyth.jpg)
Indian couples romance survey
Romance: భారతీయ దంపతులు, ప్రేమికులకు సంబంధించిన శృంగారంపై చేపట్టిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సన్నిహిత సంబంధం గురించి బహిరంగంగా మాట్లాడేందుకు సిగ్గుపడే ఇండియన్స్.. పనిలో దిగితే మాత్రం సత్తా చాటుతారంటూ రీసెంట్ సర్వేలో బయటపడింది. అయితే భారతీయులు వారంలో ఎన్నిసార్లు రతిలో పాల్గొంటున్నారనేది మాత్రం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ మేరకు 'లవ్ హనీ' అనే సంస్థ ఇటీవల దాదాపు మూడు వేలకుపైగా జంటలను శృంగారం గురించి ప్రశ్నించగా ఆసక్తికర సమాధానాలు చెప్పినట్లు వెల్లడించింది.
44 శాతం జంటలు వీకెండ్స్ లోనే..
ఈ మేరకు శృంగారంపై అవగాహన, స్వేచ్ఛ విదేశీయులతో పోలిస్తే ఇండియాలో చాలా తక్కువేనని పేర్కొంది. శృంగారంలో ఎప్పుడు పాల్గొంటారు? ఏరోజు మంచిదని భావిస్తున్నారు? వంటి విషయాలను ప్రస్తావించగా 44 శాతం జంటలు వీకెండ్స్ శని, ఆదివారాల్లోనే రతిలో పాల్గొనేందుకు ఎక్కువగా ఇష్ట పడుతున్నట్లు బయటపడింది. ఇక శుక్రవారం 23 శాతం మంది శృంగారానికి ఆసక్తి చూపితే శనివారం 20, ఆదివారం 16 శాతం మంది రతిలో పాల్గొనేందుకు ఇష్టపడుతున్నారట. సాయంత్రం 7.30 గంట సమయంలో ఏకాంతంగా గడిపేందుకు ఆసక్తి కనబరుస్తున్నారట.
ఇది కూడా చదవండి: Arvind Kejriwal: రూల్ ప్రకారం కేజ్రీవాల్ సీఎం కాలేరు.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
ధైవ భక్తి కారణంతో దూరంగా..
ఇక ఉదయం నిద్రలేచే సమయంలో పురుషుల్లో శృంగార కోరికలు అధికంగా ఉంటాయి. దీంతో కొంతమంది ఉదయం 4.30 గంటలకు రతిలో పాల్గొనేందుకు ఆసక్తిచూపుతారు. అయితే రోజంతా పని ఒత్తిడి కారణంగా తెల్లవారుజామున శృంగారం చేసేవారు కేవలం 10శాతమే. మంగళవారం రోజున అతితక్కువ మంది, గురువారం అత్యంత తక్కువ మంది రతిలో పాల్గొంటున్నారట. భారతీయులు వారంలో ప్రతి రోజు ఏదో ఒక ధైవ భక్తిని నమ్మడం వల్ల ఆ రోజు అసలే భర్తలను దగ్గరకు రానివ్వట్లేదని సర్వేలో వెల్లడైంది.
ఇది కూడా చదవండి: Ind Vs Eng: షమీ ఆగయా.. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత తుది జట్టు ఇదే