Ind Vs Eng: షమీ ఆగయా.. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత తుది జట్టు ఇదే

ఇంగ్లాండ్‌తో 5 టీ20ల సిరీస్‌కు భారత తుది జట్టును బీసీసీఐ ప్రకటించింది.15 మంది సభ్యులతో కూడిన లిస్టు రిలీజ్ చేసింది. స్టార్ పేసర్ మహ్మద్ షమీ చోటు దక్కించుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ సారథిగా జనవరి 22 నుంచి ఈ సిరీస్‌ మొదలుకానుంది. 

New Update
Shami: షమీకి అర్జున అవార్డు!.. బీసీసీఐ ప్రత్యేక అభ్యర్థన

BCCI announces India'squad for England T20 series

Ind Vs Eng: ఇంగ్లాండ్‌తో 5 టీ20ల సిరీస్‌కు భారత తుది జట్టును బీసీసీఐ ప్రకటించింది.15 మంది సభ్యులతో కూడిన లిస్టు రిలీజ్ చేసింది. స్టార్ పేసర్ మహ్మద్ షమీ చోటు దక్కించుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ సారథిగా జనవరి 22 నుంచి ఈ సిరీస్‌ మొదలుకానుంది. కోల్‌కతా వేదికగా మొదలుకానున్న IDFC ఫస్ట్ బ్యాంక్ ఐదు మ్యాచ్‌ల సిరీస్ లో ఇద్దరు తెలుగు ప్లేయర్లు తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డికి టీమ్‌లో చోటు దక్కింది. జనవరి 22 నుంచి ఫిబ్రవరి 2 వరకు వివిధ వేదికల్లో టీ20 సిరీస్‌ను నిర్వహించనున్నారు. జనవరి 17న ఇంగ్లండ్ జట్టు భారత్‌కు రానుంది.

భారత జట్టు:

సూర్యకుమార్ యాదవ్ (సి), సంజు శాంసన్ (వికెట్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ , వరుణ్ చకరవర్తి, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ధృవ్ జురెల్.

ఇది కూడా చదవండి: Danam: కేసీఆర్, కేటీఆర్‌పై ప్రశంసలు.. కాంగ్రెస్‌పై దానం తిరుగుబాటు?

మొదటి మ్యాచ్ జనవరి 22 ఈడెన్ గార్డెన్స్
రెండవ మ్యాచ్ జనవరి 25 చెన్నై
మూడవ మ్యాచ్ జనవరి 28 రాజ్‌కోట్
నాల్గవ మ్యాచ్ జనవరి 31 పూణె
ఐదవ మ్యాచ్ ఫిబ్రవరి 2 ముంబై 

ఇంగ్లండ్ జట్టు:
జోస్ బట్లర్ (కెప్టెన్) రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, జేమీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్.

ఇది కూడా చదవండి: TET: టెట్ పరీక్షలో గందరగోళం.. సర్వర్ డౌన్ కావడంతో ఆగిపోయిన పరీక్ష

ఇక టీ20 సిరీస్‌ ముగియగానే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆడనున్నాయి. 

వన్డే సిరీస్ షెడ్యూల్:
ఫిబ్రవరి 6 - తొలి వన్డే (నాగ్‌పుర్)
ఫిబ్రవరి 9 - రెండో వన్డే (కటక్)
ఫిబ్రవరి 12 - మూడో వన్డే (అహ్మదాబాద్)

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు