Cinema: ఎట్టకేలకు క్లీంకార ఫేస్ చూపించిన రామ్ చరణ్..ఎంత క్యూట్ గా ఉందో..

మెగా హీరో రామ్ చరణ్ ముద్దుల కూతురు క్లీంకార ఫేస్ మొత్తానికి రివీల్ అయింది. గుర్తు తెలియని వ్యక్తి తీసిన వీడియోలో ఆమె మొహం స్పష్టంగా కనిపిస్తోంది. చరణ్..క్లీంకారను ఎత్తుకుని వెళుతున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.  

author-image
By Manogna alamuru
New Update
మెగా

మెగా వారసురాలు క్లీంకార

మెగా హీరో రామ్ చరణ్ కు పాప పుట్టి దాదాపు ఏడాదిన్నర పైనే అయింది. అయితే ఇప్పటి వరకు ఆమె మొహం కనపడకుండా జాగ్రత్తపడుతున్నారు. ఆమె ఫోటోలు బయటకు వచ్చినా క్లీంకార మొహం మాత్రం కవర్ చేస్తూ వచ్చారు. ఎంత ట్రై చేసినా ఎవరూ పాప ఫోటోలు మాత్రం తీయలేకపోయారు. అయితే ఎట్టకేలకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల ముద్దుల కూతురు క్లీంకార ఫేస్ చూడాలన్న మెగా ఫ్యాన్స్ కోరిక తీరింది. తాజాగా బయటకు వచ్చిన ఓ వీడియోలో ఆమె ఫేస్ రివీల్ అయింది. చరణ్, ఆమెను ఎత్తుకుని వెళుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి తీసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. మెగాస్టార్ మనువరాలు ఎంతో క్యూట్ గా ఉందని...అన్నీ తండ్రి పోలికలే అంటున్నారు అభిమానులు.  

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు