/rtv/media/media_files/2025/02/14/kkBIFWJ1yXsEtJMx5moq.jpg)
sukesh chandra Photograph: (sukesh chandra)
జైలు శిక్ష అనుభవిస్తున్న సుఖేశ్ చంద్రశేఖర్ బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు లవ్ లెటర్ రాశాడు. మరో జన్మమంటూ ఉంటే ఆమె హృదయంగా పుట్టాలనుందని అతను ప్రేమలేఖలో పేర్కొన్నాడు. అంతేకాడు ప్రేమికుల రోజు సందర్భంగా అతను జాక్వెలిన్‌కు ఓ ప్రైవేట్ జెట్ కూడా గిఫ్ట్ ఇస్తున్నట్లు కూడా చెప్పాడు. సినిమా షూటింగ్స్, బిజినెస్ పనుల మీద ఆమె విదేశాలు ప్రయాణించాల్సి ఉంటుందని ఆమెకు ఆ గిఫ్ట్ ఇచ్చిన్నట్లు అతను లవ్ లెటర్‌లో రాశాడు. అంతేకాదు ఆ ప్రైవేట్ జెట్ ఫ్లైట్ మీద ఆమె పేరులోని ఫస్ట్ అక్షరాలు కూడా ఉంటయట.
Also Read: పంజాబ్‌కే అక్రమ వలసదారులను అమెరికా ఎందుకు పంపిస్తోంది ?
హ్యాపీ వాలంటైన్స్ డే అని చెబుతూ.. జీవితాంతం ప్రేమికుల రోజును కలిసి జరుపుకోవడానికి మనం ఒక్క అడుగు దూరంగలో ఉన్నామని రాశాడు. జాకీ నిజంగానే నాకు నువ్వంటే ఎంతో ఇష్టం. ప్రపంచంలోనే నువ్ అద్భుతమైన ప్రియురాలివి. నేను ఒక పిచ్చివాడిలా ప్రేమిస్తున్నానని లవ్ లెటర్ లో పేర్కొన్నాడు సుఖేశ్ చంద్ర.
Also read: మోదీ బీసీ కాదు.. కేసీఆర్‌కు తెలంగాణలో ఉండే హక్కు లేదు: రేవంత్ సంచలనం!
అతనుకొందరిని ఆర్థికంగా మోసం చేసి జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. 2020 జూన్ నుంచి2021 మేవరకు మొబైల్ ఫోన్లు, వాయిస్ మాడ్యూలర్లు వాడి శివీందర్ సింగ్ భ్యార అదితి సింగ్‌కు ఫోన్లు చేశాడు. లా సెక్రటరీ అనూప్ కుమార్ గా పరిచయం చేసుకొని ఆమె భర్తకు బెయిల్ ఇప్పిస్తానని రూ.200 కోట్లకు పైగా వసూలు చేశాడు. ఈ కేసులో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అంతకు ముందు జాక్వెలిన్, సుఖేశ్ చంద్ర లవర్స్, ఈ నేరాలు బయటపడటంతో ఆమెతో సుఖేశ్ సన్నిహితంగా ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి. దీంతో వీరి రిలేషన్‌షిప్ బయటపడింది. గతంలో కూడా సుఖేశ్ జైలు నుంచి జాక్వెలిన్‌కు లేఖలు రాశాడు.
Conman Sukesh Chandrashekhar presented before a Delhi court in a money laundering case.
— ANI (@ANI) March 10, 2023
On being asked about the arrest of AAP leader Manish Sisodia he said, "Truth has prevailed, and next will be Arvind Kejriwal." pic.twitter.com/JlnlK8pjXE